Babri maszid demolition issue

babri maszid demolition issue

babri maszid demolition issue

10.gif

Posted: 07/08/2012 03:19 PM IST
Babri maszid demolition issue

      pvnకులదీప్ నయ్యర్ తన ఆత్మకథలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై చేసిన విమర్శలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. దేశాన్ని మతపరమైన సంక్షోభంలోకి నెట్టిన బాబ్రీ విధ్వసం సమయంలో  పీవీ పూజలో నిమగ్నమయ్యారన్న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను అప్పటి పీవీ మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్ ఖండించారు. యూపీలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రసాద్ తెలిపారు.  యూపీలో రాష్ట్రపతి పాలనకు అవకాశమే లేదని, అదనపు బలగాలను పంపుతామన్న కేంద్ర సూచనను  నాటి సీఎం కళ్యాణ్  సింగ్  తోసిపుచ్చారన్నారు. సీనియర్ జర్నలిస్టు కులదీప్ వ్యాఖ్యలపై సీఎల్పీ మండి పడింది. ఇది మతతత్వ శక్తుల కుట్ర అని సీఎల్పీ ఆరోపించింది. బాబ్రీ మసీద్ kuldip_nayarకూల్చివేత నిర్లక్ష్యానికి  పివి ఒక్కరే బాధ్యులు కాదని కాంగ్రెస్ పార్టీ నాటి ఘటనకు భాద్యత వహించాలని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. బాబ్రీ  వివాదానికి అసలు తెర తీసింది రాజీవ్ గాంధీయేనని, 1989లో రాజీవ్ అక్కడ ఎన్నికల ప్రచారం చేశారని గుర్తు చేశారు.
    కులదీప్ నయ్యార్ వ్యాఖ్యలను తెలకపల్లి స్వాగతించారు. బాబ్రీ వివాదంలో పివి పేరు వినిపించడం ఇదే తొలిసారి కాదు. లిబ్రహాన్ కమీషన్  ఎదుట పివి వాంగ్మూలమిచ్చినా రాజకీయంగా ఆయనపై దాడి మాత్రం ఆగలేదు. బాబ్రీ ఘటనకు పివిని బాధ్యుడ్ని చేసే ప్రయత్నాలు ఆగలేదు.  కులదీప్  నయ్యర్  తాజా  రచనతో ఈ వివాదం మళ్లీ రాజుకున్నట్టైంది. కాగా, బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు దివంగత మాజీ ప్రధాని పివీ.నరసింహరావు మానసికంగా కుంగిపోయి తలదించుకున్నారని మాజీ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చంద్రశేఖర్ రావు అన్నారు. అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అఫిడవిట్ ఇవ్వడం, సుప్రీం కోర్టు దానిని నమ్మి జోక్యం చేసుకోవడం ఫలితంగానే పీవీ అక్కడ రాష్ట్రపతి పాలన విధించలేకపోయారన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Floods in russia
Former up cm mayavati illegal assets case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles