Rail tax goes off track on mamatas red flag

Rail tax goes off track on Mamata's red flag,Indian Railway Department, Relief, AC Rail Travels, Laugage Transfer, Railway Passengers, TMC,new service tax regime,Manmohan Singh,AC-class passenger fares,freight charges,Mukul Roy,Mamata Banerjee,UPA governmentRailway Minister Mukulram, PM Manmohan Singh, Railway Service Tax

Rail tax goes off track on Mamata's red flag

Rail.gif

Posted: 07/03/2012 12:43 PM IST
Rail tax goes off track on mamatas red flag

Rail tax goes off track on Mamata's red flag

ప్రయాణ చార్జీల పెంపుతో సతమతమవుతున్న రైలు ప్రయాణీకులకు తాత్కాలికంగా కొంత ఉపశమనం లభించనుంది. ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలపై 12 శాతం సేవా పన్నును సెప్టెంబర్ 30వ తేదీ వరకూ విధించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత రైల్వేలు అందిస్తున్న ప్రయాణ, సరుకు రవాణా వంటి ముఖ్యమైన సేవలపై ప్రభుత్వం సేవా పన్నును మినహాయించిందని, మూడు నెలల పాటు కొనసాగే ఈ మినహాయింపు సెప్టెంబర్ 30వ తేదీ వరకూ అమలులో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలకు సేవా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది.

రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ శాఖ బాధ్యతలను కూడా మన్మోహన్ సింగ్ పర్యవేక్షిస్తున్న విషయం విదితమే. నెగెటివ్ లిస్టు ప్రాతిపదికన రూపొందించిన సరికొత్త సేవా పన్ను విధానాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం కేవలం 38 సేవలను మాత్రమే లెవీ చెల్లింపు నుంచి మినహాయించారు. సేవా పన్ను చెల్లింపు నుంచి రైల్వేలకు మినహాయింపు ఇవ్వాలని ముకుల్ రాయ్ ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీకి కూడా విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  List of flag bearers for great britain at the olympics
Ms office 365 for education now free for educational institutes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles