Chinese astronauts successfully complete first manual space docking

Chinese astronauts successfully complete first manual space docking,Chinese astronauts, Shenzhou-9, Dragon Boat festival

Chinese astronauts successfully complete first manual space docking

Chinese.gif

Posted: 06/30/2012 10:48 AM IST
Chinese astronauts successfully complete first manual space docking

Chinese astronauts successfully complete first manual space docking

మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో మానవ డాకింగ్ ప్రక్రియను పూర్తిచేసి తన శాస్త్ర పరిశోధనా పాటవాన్ని రుజువుచేసింది. ఓ మహిళా వ్యోమగామి సహా ముగ్గురు చైనా వ్యోమగాములు 13 రోజుల రోదసి యాత్రను పూర్తిచేసుకుని సురక్షితంగా భువికి చేరుకున్నారు. మాన్యువల్ డాకింగ్ ప్రక్రియను సజావుగా పూర్తిచేయడం ద్వారా ఇప్పటికే అమెరికా, రష్యాలకే సొంతమైన జాబితాలో చైనా కూడా తన పేరును నమోదు చేసుకుంది. 2020కల్లా అంతరిక్షంలో ఐఎస్‌ఎస్ తరహాలో ఓ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ముగ్గురు వ్యోమగాములను చైనా ఇటీవల రోదసికి పంపింది. ఈ ముగ్గురితో షెన్‌ఝౌ-9 అనే వ్యోమనౌక సజావుగా మంగోలియాలోని ఓ పచ్చిక బయలు ప్రాంతంలో దిగినట్లుగా తెలుస్తోంది. భూ వాతావరణంలోకి ప్రవేశించేముందు తీవ్రస్థాయిలో ఎదురైన వేడిని తట్టుకుని ఈ వ్యోమనౌక విజయవంతంగా వెనక్కి తిరిగి రాగలిగింది. ఇది భూమికి పది కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ఒక ప్యారాచూట్ దానినుంచి విచ్చుకుంది. ఆవిధంగా ఈ వ్యోమనౌక వేగం తగ్గింది. నెమ్మదిగా ఒక పెద్ద శబ్దంతో నిర్దేశిత ప్రాంతంలో దిగింది. ఇది భూమిమీద దిగిన తర్వాత దానినుంచి బయటకు రావడానికి ముగ్గురు వ్యోమగాములకు గంటకు పైగా పట్టింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని చైనా ప్రధాని వెన్ జియా బావో, ఇతర సీనియర్ అధికారులు ఉత్సాహంగా తిలకించారు. ఈ ముగ్గురి వ్యోమగాముల్లో మొదట జింగ్ హైపెంగ్ అనే కమాండర్ బయటికొచ్చారు. ఆ తర్వాత 33 ఏళ్ల నియూ వాంగ్, తొలి మహిళా వ్యోమగామి లియూయాంగ్ వచ్చారు. తొలిసారిగా స్పేస్ డాకింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయగలిగామని, అంతే ఉత్సాహంగా స్వదేశానికి తిరిగి రాగలిగామని జింగ్ హైపెంగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap government hikes da of its employees and pensioners
Ten karnataka ministers to resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles