Indan train

indan train,

indan train

indan train.gif

Posted: 06/13/2012 08:36 PM IST
Indan train

 indan train

 భారతీయ రైళ్లు  తమ ప్రయాణికులకు  సరైన  సదుపాయాలు  కల్పించటంలో ఇప్పటికీ  ఎంతో  వెనుకబడి ఉన్నాయి.  రైలు ప్రయాణీకులు  ప్రధానంగా  ఎదుర్కొనే  సమస్యల్లో  భద్రత  ప్రధాన  అంశంగా   ఇటీవల  తెరపైకి  వచ్చింది.  దీంతో పాటు  మరెన్నో  సమస్యలు  ప్రయాణికులను  వేదిస్తున్నాయి.  అక్రమంలో  అతి ముఖ్యమైనది  అపరిశభ్రత. రైళ్లలో  మరుగుదొడ్ల  నిర్వహణ  అధ్వానంగా  ఉంటొందన్నది  అత్యధిక  ప్రయాణికుల  అభిప్రాయం.  కోచ్ లు  శుభ్రంగా  లేకపోవడం,  రైళ్లలో  సరఫరా చేసే ఆహారం  నాణ్యంగా  లేకపోవటంపై  ఎక్కువ మంది ప్రయాణికులు అసంతృప్తి
 వ్యక్తం చేస్తున్నారని  మార్కెట్  ఎక్సెల్  అనే పరిశోధనా  సంస్థ  వెల్లడించింది. దేశంలోని 12 నగరాలు  సహా నాలుగు  రైల్వే  జోన్లలో  ఈ సంస్థ సర్వే  నిర్వహించింది.  ప్లాట్ ఫాంలు,  కోచ్ లు,  మరుగుదొడ్ల  నిర్వహణ , పడక  సదుపాయం , ఆహార  నాణ్యత , నీటి లభ్యత  టిక్కెట్   తనిఖీ అధికారుల  ప్రవర్తన  తదితర  అంశాలపై  ప్రయాణికుల అభిప్రాయాలను  ఈ సంస్థ సేకరించింది. 12 వేల మంది   ప్రయాణికులు  పాల్గొన్న  ఈ  సర్వేలో  అత్యధికంగా 30 శాతం మంది  మరుగుదొడ్లలోని  అపరిశుభ్రతను ప్రధాన  సమస్యగా  చెప్పారు.  14 శాతం  మంది  కోచ్ లలో  శుభ్రతలేమిపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagababu advises mega fans
Parsi earning rs 90k per month is poor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles