Ap government green signal

ap government green signal

ap government green signal

1.gif

Posted: 06/03/2012 01:02 PM IST
Ap government green signal

      ఎమ్మార్ నిందితులకు షాకింగ్ న్యూస్ తగిలింది. ఈ కేసులో బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంలను విచారణకు అనుమతివ్వాలన్న సీబీఐ అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్ కు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు నిరాకరించింది. సుబ్రహ్మణ్యాన్ని విచారించేందుకు తగిన ఆధారాలు లేవని ప్రభుత్వం అభిప్రాయపడింది. 1మరోవైపు ఎల్వీని ఈనెల 18న విచారణకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల విచారణకు అనుమతిచ్చే దస్త్రంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీపీ ఆచార్యను విచారించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఐఏఎస్ ల విచారణకు కేంద్రం ఇచ్చే అనుమతికి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కీలకం కావడంతో ఈ దస్త్రం నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంది. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవడంతో సీబీఐ ఐఏఎస్ లను విచారించనుంది.
      టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యంకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమార్ కేసులో ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే సీబీఐ ఎల్వీని విచారించేందుకు సీఎం మాత్రం అనుమతి నిరాకరించారు. కొందరు ఐఏఎస్ ల ఒత్తిడి మేరకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్రమణ్యంను బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి తీసుకున్నట్లు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan at koti
Google product search to become google shoppinguse pay to play model  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles