Chirranjeevi by elections campaign

chirranjeevi by elections campaign

chirranjeevi by elections campaign

27.gif

Posted: 05/27/2012 03:32 PM IST
Chirranjeevi by elections campaign

      ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ చిరంజీవికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో గల ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో చిరు నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్డుషోకు విశేష ప్రజాదరణ లభించింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం ఎస్.రాయవరం మండలంలో కొన్ని గ్రామాల్లో ఆశించినంతగా ప్రజలు హాజరుకానప్పటికీ మధ్యాహ్నం తరువాత జరిగిన పర్యటనలో ప్రజలు హాజరు ఆశాజనకంగానే ఉంది. యువకులు కేరింతలు, డ్యాన్స్‌లు గుమిగూడిన జనాలు చిరంజీవికి ఉన్న సినిమా ఇమేజ్‌ను స్పష్టం చేశారు. పేట ఉప ఎన్నికలు సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమనకు మద్దతుగా నిర్వహించిన ఈరోడ్డు షోకు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివచ్చారు. 8    

      ప్రకటించిన సమయం కంటే ఐదు గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు విసుగుచెందకుండా చిరంజీవి రాకకోసం ఎదురుచూశారు. కోటవురట్ల మండలంలో రామచంద్రపురం గ్రామం నుంచి ప్రారంభమైన రోడ్డుషో పందూరు, గొట్టివాడ, చౌడువాడ, కైలాసపట్నం, రాట్నాలపాలెం, కోటవురట్ల వరకు జరిగింది.  ప్రచార సమయం దాటిపోవడంతో ముందుగా ప్రకటించిన కొన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిలిపివేశారు. వయస్సు నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు వృద్ధులు చిరంజీవిని చూసేందుకు ఉత్సాహం చూపారు. హస్తం గుర్తు చూపిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా చిరంజీవి ప్రజలను కోరారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Main opposition party in national politics bjp suffers
Bomb rumors in bejawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles