Bharath bandh on 31st of this month

bharath bandh on 31st of this month

bharath bandh on 31st of this month

23.gif

Posted: 05/27/2012 03:21 PM IST
Bharath bandh on 31st of this month

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, విద్యుత్‌ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31న భారత్ బంద్‌కు 11 విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆ రోజు బంద్‌ పాటించి, విజయవంతం చేయాలని ఆయా పార్టీలు విజ్ఞప్తి చేశాయి. కేంద్రప్రభుత్వం పెట్రోల్‌ ధరలను భారీగా గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు ఏడున్నర రూపాయలు పెంచింది. 7దీనికి తోడు గ్యాస్‌ ధరను సిలిండర్‌ రూ.50 పెంచాలని, డీజీల్‌ లీటర్‌కు రూ.5 పెంచాలని యోచిస్తున్నదని ఆయా పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ధర పెంపుతో రాష్ట్ర ప్రజలపై రూ.1250 కోట్లు భారం పడుతుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 33 శాతం, డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తున్నదని, వామపక్ష నాయకులు తెలిపారు. కేంద్రం ధర పెంచినప్పుడల్లా తగ్గించామని కోరా ల్సిన రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ రాబడితో సంబరపడుతుందని వారు విమర్శించారు. వ్యాట్‌ వల్ల రూ.250 కోట్ల రాబడి వస్తుండటంతో వ్యాట్‌ను తగ్గించుకోవటానికి నిరాకరిస్తుందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీల బిల్లులు ప్రజలకు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని, ఛార్జీల పెంపుదల కనీసం 20 శాతం నుంచి 80 శాతం వరకు ఉందని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు.
      ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 31న రాష్ట్ర బంద్‌ను పాటించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని 11 వామపక్ష పార్టీల నాయకులు కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb rumors in bejawada
Praja shanti party chief ka paul says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles