Ysr congress president jagan attend 3 day also

ysr congress president jagan attend 3 day also

ysr congress president jagan attend 3 day also

3.gif

Posted: 05/27/2012 01:47 PM IST
Ysr congress president jagan attend 3 day also

     వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇవాళ కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. తన నివాసం లోటస్ పాండ్ నుంచి ఉదయం 10.20 గంటల ప్రాంతంలో జగన్ దిల్ కుశా అతిథిగృహానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఆయన వరుసగా మూడవ రోజూ సిబిఐ విచారణకు హాజరైనట్లైంది.
కాగా, జగన్ ఆస్తుల వ్యవహారంలో రెండో రోజూ విచారణ యథాతథంగా కొనసాగింది. లోటస్ పాండ్ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో బయలు దేరిన జగన్ సరిగ్గా పదిన్నరకు రాజ్ భవన్ రోడ్డులోని దిల్ కుషా అతిథి గృహానికి చేరుకున్నారు. రెండో రోజు భద్రతా, వ్యక్తిగత సిబ్బంది బయటే నిలిచిపోగా జగన్  వెంట సబ్బం హరి, భూమానాగిరెడ్డి వచ్చారు. ఆ తర్వాత జగన్  ఒక్కరే సీబీఐ కార్యాలయం లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. విచారణలో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ, ఎస్పీ వెంకటేష్ నేతృతంలోని అధికారుల బృందం జగన్ ను ప్రశ్నించింది.
    ఉదయం 11.30నిమిషాల నుండి 12గంటల వరకు జేడీనే స్వయంగా జగన్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా జగన్ ను 143 ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ముందే జగన్ ను ప్రశ్నించారని జగన్ సన్నిహిత వర్గాలన్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కు చెందిన జగతి, ఇందిరా, జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో 550కోట్ల పెట్టుబడులపై ఆరా తీసినట్లు తెలిసింది. సండూరి పవర్ ప్రాజెక్టు ఆగిపోయినా నిధులు ఎలా వచ్చాయి? అని జగన్ ను ప్రశ్నించినట్లు సన్నిహిత వర్గాలన్నాయి.2    2004లో 9లక్షలు, 2009 లో 77కోట్ల రూపాయల ఆదాయపన్ను చెల్లించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టారు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఆదాయం ఎలా పెరిగిందని జగన్ ను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే దేవుడు నాతో ఉన్నాడని జగన్ ఈ ప్రశ్నకు బదులిచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇథోరియా ఇన్ ఫ్రా , కార్మేల్ ఏషియా, ఇండస్ ప్రాజెక్ట్ , సండూర్ పవర్ వంటి వాటిపై జగన్ ను 143ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
     వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో విడుదలైన జీవోలపై కూడా జగన్ ను ప్రశ్నించినట్లు ఆయన సన్నిహిత వర్గాలన్నాయి. ఓ వైపు జగన్ ను ప్రశ్నిస్తూనే ఈకేసులో ఇప్పటికే అరెస్టయిన మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను మరోగదిలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జగన్ ను సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలోనే సీబీఐలోని ఓ బృందం అబిడ్స్  గన్ ఫౌండ్రీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జగన్ కు సంబంధించిన అకౌంట్స్ పై ఆరా తీసింది. ఇందులో భాగంగానే జగన్ అకౌంట్స్ సంబంధించిన లెక్కాపద్దులన్నింటినీ సిడిలో కాపీ చేసుకున్నట్లు తెలిసింది.
     ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు జగన్  విచారణ పర్వం కొనసాగింది. ఆతర్వాత అరగంటపాటు భోజన విరామం ఇచ్చారు. వ్యక్తిగత సిబ్బంది క్యారియర్  తీసుకరాగా జగన్  అక్కడే లంచ్  చేశారు. ఆతర్వాత జగన్  ప్రశ్నిస్తున్న దిల్ కుషా అతిథిగృహం.. నాంపల్లి కోర్టు వద్ద కాస్త హడావుడి మొదలైంది. కోర్టు వద్ద కనివినీ ఎరుగని రీతిలో భద్రతను పెంచారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనన్న టెన్షన్  నెలకొంది. సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు జగన్ విచారణ ముగిసింది.
   దాదాపు ఏడున్నర గంటలపాటు సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. అయితే సీబీఐ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని జగన్  చెప్పారు. ఇవాళ కూడా సీబీఐ ముందు వైఎస్ జగన్ హాజరవుతుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తలపెట్టారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By pols nominations scrutiny complete
Appsc group 1 exam held peacefully  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles