West bengal cm mamata benarji live show

west bengal cm mamata benarji live show

west bengal cm mamata benarji live show

19.gif

Posted: 05/20/2012 02:24 PM IST
West bengal cm mamata benarji live show

       పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మళ్లీ కోపం వచ్చింది. ఓ టీవీ చానెల్ లైవ్ షోలో దీదీ సహనం కోల్పోయారు. కార్టూన్ వ్యవహరంపై జాదవ్ పూర్ ప్రొఫెసర్ ను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నకు ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడారు. విద్యార్థులు మావోయిస్టులంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు ఆగ్రహంతో ఊగిపోయిన దీదీ రుసరుసలాడుతూ లైవ్ షో ను రసాభాసగా మార్చారు. జనం చూస్తున్నారు. విద్యార్థులు, మేధావులతో మాట్లాడుతున్నాన్న విచక్షణ కోల్పోయిన మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలి పోయారు. 10
      ఇంతకీ ఆమెకు ఎందుకు కోపం వచ్చిందంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా పూర్తైన సందర్భంగా ఓ టెలివిజన్ ఛానెల్ విద్యార్థులతో ముఖాముఖీ ఏర్పాటు చేసింది. ఈ షోలో  పాల్గొన్న విద్యార్థులు జాదవ్ పూర్  యూనివర్సీటీ ప్రొఫెసర్ అరెస్ట్ పై ప్రశ్నించారు. కార్టూన్ వ్యవహారంలో ప్రొఫెసర్ ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ సూటిగా అడగటంతో మాయాకు చిర్రెత్తుకొచ్చింది. సహనం కోల్పోయిన దీదీ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్టూన్  లు అంటే తనకూ ఇష్టమేననీ జాదవ్ పూర్ ప్రొఫెసర్ సీపీఎం పార్టీకి చెందిన వ్యక్తనీ తన ఇ మెయిల్ ను దుర్వినియోగం చేసి వారి అంగీకారం లేకుండా ఆకార్టూన్ ను 60మందికి పంపాడంటూ దీదీ చెలరేగారు.
      పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న ఓ స్టూడెంట్ ప్రశ్నకూ మమతా మండిపడ్డారు. తన పాలనలో మహిళలకు పూర్తి స్తాయిలో భద్రత ఉందని చెప్పుకొచ్చారు. ఇంతటితో మమతా కోపం చల్లారలేదు. షోలో పాల్గొన్న వారిలో కొందరు సీపీఎం కార్యకర్తలనీ, మరికొందరు మావోయిస్టుల సానుభూతి పరులంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు మైక్ తీసేసి లైవ్ షో సగంలోనే వెళ్లిపోయారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri tirumala venkatesa laddus
Tdp telangana bus tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles