ఈ భూమిమీద ఉన్న మనుషుల్లో మహిళలే చాలా అందంగా ఉంటారని తెలుసు. పురుషులు అంత అందంగా ఉండరని మనకు తెలిసిన విషయం. కానీ మానవజాతిలో పురుషులు నానాటికీ ఆకర్షణీయంగా రూపొందుతున్నారని తాజా పరిశోధన వెల్లడించింది. సృష్టిలో పక్షులు (కోడిపుంజు, నెమలి), జంతువులు (సింహం, ఎద్దు, పొట్టేలు), కొన్నిరకాల కీటకాలు... చక్కదనమంతా మగజాతిలోనే కనిపిస్తుంది.
ప్రసిద్ధ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సూత్రీకరించిన 'సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్' (మనగలిగితేనే మనుగడ)ద్వారా ఇది రుజువవుతోందని, ఆధునిక యుగంలోనూ ఇది కొనసాగుతున్నదని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మానవ పరిణామం 'వేట-సేకరణ' కాలం నుంచి వ్యవసాయం, పెళ్లివంటి పద్ధతులు, సామాజిక కట్టుబాట్లవైపు సాగినా 'నేచురల్ సెలెక్షన్' (ప్రకృతి ఎంపిక)ను మందగింపజేయలేదని తెలిపింది.
చక్కటి రూపం, మేధస్సు వంటి లక్షణాలను సంతరించుకోవడం ద్వారా 'సంభోగ సాఫల్య' శాతాన్ని పెంచుకునే దిశగా పురుషులు పరిణామం చెందుతున్నట్లు పేర్కొంది. ఎలాగంటే... 'ఒకరికన్నా ఎక్కువ భాగస్వాములతో కలయిక వల్ల పురుషుడి పునరుత్పత్తి సాఫల్య అవకాశాలు మెరుగుపడతాయి. కానీ, స్త్రీలలో ఇది సాధ్యం కాదు' అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ విర్పి లుమా స్పష్టం చేశారు.
షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో జంతు, వృక్షశాస్త్ర విభాగం శాస్త్రవేత్త అయిన ఆమె ఇంకా ఏం చెప్పారంటే... "వ్యవసాయం, ఏక పత్నీవ్రతం వంటివాటితో మానవ పరిణామక్రమం ఆగిపోయిందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. కానీ, ఫిన్లాండ్లో 1760-1849 మధ్య జన్మించిన 6 వేల మందికి సంబంధించిన చర్చి రికార్డులను మేం పరిశీలించినపుడు అది అపోహేనని స్పష్టమైంది. ఎదుగుదలదాకా జీవనం, భాగస్వామి అందుబాటు, సంభోగ సాఫల్యం-పునరుత్పత్తి... ఈ నాలుగూ ప్రకృతి ఎంపికను నిర్దేశించే కీలకాంశాలు. వీటిని నిర్ధారించడానికి ఆరువేల మంది ఆర్థికస్థాయి, జనన మరణాలు, పెళ్లిళ్ల చరిత్రను అధ్యయనం చేశాం. తద్వారా ప్రాణికోటిలో నేటికీ సాగుతున్న నిరంతర పరిణామం మానవుల్లోనూ ప్రస్ఫుటమైంది'' అన్నారు. కాకపోతే ప్రకృతి ఎంపికతోపాటు లైం గిక ఎంపిక కూడా మానవుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more