Tdp leader chandra babu naidu anantapur election campaign

tdp leader chandra babu naidu anantapur election campaign

tdp leader chandra babu naidu anantapur election campaign

5.gif

Posted: 05/01/2012 04:44 PM IST
Tdp leader chandra babu naidu anantapur election campaign

       రాష్ట్రంలో అరాచక శక్తులను అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు అధికారమిస్తే..  చేనేతల బతుకులను బాగు చేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నల కుటుంబాలను పరామర్శించిన ఆయన.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించకుంటే దుకాణాలపై దాడులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం) అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పనికిమాలిన సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నారన్నారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవి తన సొంత న్యాయం కోసం కాంగ్రెస్ లో కలిసిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.babu_inff
       కాగా, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన చంద్రబాబు.. ఇవాళ్టి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. తూర్పు బజారు ప్రాంతంలోని చేనేత కుటుంబాలను ఆయన కలుసుకున్నారు. స్వయంగా మగ్గాన్ని నేసి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా,  ప్రచారానికి సంబంధించి జిల్లా నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాయదుర్గం ఏఎంసీ కళాశాలలో జరిగే సభతో చంద్రబాబు ప్రచారం ప్రారంభించి, బోమ్మనహాల్ లో రోడ్ షో నిర్వహించారు.  ఆ తర్వాత ఉద్దేహాల్, ఎల్బీనగర్, ఎర్రగుంట, పుల్లంపల్లి మీద తన ప్రచారం కొనసాగుతుందని మాజీ ఎంపి కాలువ శ్రీనివాస్ తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New zealand mayor sets longest interview record
Jagan and roja blame chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles