Jgan west godavari district on by election campaign

Elections Campaign, By Elections, By Polls, YS Jagan, YSR Congress, YSR Party, YS Rajasekhara Reddy, Road Show, Kiran Kumar Reddy, Botsa Satyanarayana,

YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan reddy said, he would be rule Andhra Pradesh like his father and late YS Rajasekhar Reddy if his party will win in next elections. He was campaigning in Narsapuram of West Godavari district

Jgan West Godavari District On By Election Campaign.gif

Posted: 04/26/2012 11:36 AM IST
Jgan west godavari district on by election campaign

Jaganకడప జిల్లా పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే పెద్దలు చెప్పిన ఓ సామెత గుర్తొస్తుంది. ‘‘బిడ్డ పుట్టక ముందే కుల్ల కట్టించినట్లు’’. తన పార్టీకి పట్టుమని పది మంది కూడ ఎమ్మెల్యేల బలం లేని జగన్ రానున్న ఉప ఎన్నికల్లో గెలుస్తాడో లేదో తెలియదు కాదు కానీ ఇతడు మాట్లాడే మాటలు మాత్రం చాలా విడ్డూరంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజక వర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడారు.

తాను ముఖ్యమంత్రిని అయ్యాక తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు తన ఫోటో కూడా పెట్టుకునేలా రాష్ట్రాన్ని పాలిస్తానని , తన తండ్రి వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేక మంది పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. తాను కూడా అదే విధంగా పాలిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకునేలా ప్రజల కోసం పాటుపడతానని అన్నారు. వైయస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్సుమెంట్స్, 108 పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈయన మాటలు విన్న అక్కడి వారు ఆయన అధికారంలోకి వస్తే కదా... అని చెవులు కొరుక్కున్నట్లు వార్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmipur mla hikaka release by mavos
Gadde babu rao to join ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles