Students clash in osmania university over beef fest

Students clash in Osmania University over 'beef fest,Osmania Universities, news, hindustantimes, Beef festival

Students clash in Osmania University over 'beef fest

Student.gif

Posted: 04/16/2012 10:39 AM IST
Students clash in osmania university over beef fest

Students clash in Osmania University over 'beef fest

ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ (ఎద్దుకూర పండుగ) ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఫెస్టివల్‌ను ఒక వర్గం విద్యార్థులు నిర్వహించగా... మరో వర్గం విద్యార్థులు వ్యతిరేకించారు. ఓయూ ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాయంత్రం 6 30 గంటలకు క్యాంపస్ ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ ఆవరణలో ‘బీఫ్ ఫెస్టివల్’ను నిర్వహించారు. పలువురు ఫ్రొఫెసర్లు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమాన్ని కొన్నివిద్యార్థి సంఘాలు వ్యతిరేకించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల ఉపన్యాసాలు ముగిసిన అంనతరం భోజనాలకు ఉపక్రమించారు. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ న్యూ పీజీ హాస్టల్ నుంచి కార్యక్రమా వేదిక వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారు వెనక్కితగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దీంతో విద్యార్థులు చెల్లాచెదురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొంతమంది విద్యార్థులు సీ హాస్టల్ ముందు ఆగి ఉన్న ‘జెమిని న్యూస్’ లైవ్ వాహనానికి నిప్పుపెట్టారు. తర్వాత కొద్దిసేపు వాతావరణం నివురుగప్పిన నిప్పుగా మారింది. కొంతమంది విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయన్న వదంతులు వినిపించాయి. ఓల్డ్ పీజీ నుంచి ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ వైపు వెళ్తున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పీడీఎస్‌యూ సత్య, కవిత, తెలుగు యూనివర్సిటీల విద్యార్థులు పాల్గొన్నారు.

ఎద్దు మాంసం పౌష్టికాహారం: రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు

ఎద్దు మాంసం మనుషుల ఆరోగ్యానికి మంచిదని, ఇందులో పలు ప్రోటిన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చునని అన్ని పార్టీలు తమ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ ఉందని, తమ హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదని ఓయూ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు.

Students clash in Osmania University over 'beef fest

రాజ్యాంగంలో పలానా కూరనే తినాలి, ఎద్దుకూర తినొద్దు అని ఎక్కడా లేదన్నారు. తమకు విలువ ఇవ్వని హిందూ మతాన్ని వెలివేస్తున్నామని పేర్కొన్నారు. బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించడం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మార్పునకు నాంది పలికారని ఓయూ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తెలిపారు. 

Students clash in Osmania University over 'beef fest

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrested actor s claims keep vips on tenterhooks
Obama s security staff sent home for misconduct  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles