Machine to make drinking water from toilet waste

Machine to make drinking water from toilet waste,energy,fuel,sewage,lot,latest,produce,world,research,developing,dollars,haigh,turn,making,us,30,pays,recycling,eau,toilette,disease,venture,water,clean,foundation,waste,prove,people,melinda,gates,bill,Bill Gates funds new machine filters toilet waste drinkable water

Machine to make drinking water from toilet waste

drinking.gif

Posted: 04/07/2012 05:30 PM IST
Machine to make drinking water from toilet waste

Machine to make drinking water from toilet waste

ఎండకాలం .. ముఖ్యంగా వాటర్ భయం పట్టుకుంటుంది. ఈ సమస్య ఒకరిది కాదు.. ఒక దేశానిది కాదు.. యావత్తు ప్రపంచ మొత్తం ఈ సమస్యపై పోరాటం చేస్తునే ఉంది. భూమిలో వాటర్ నిల్వలు ఇంకిపోతున్నాయి. వర్షం ద్వార వచ్చిన నీటిని మనం కాపాడుకోలేకపోతున్నాం. వర్షం వాటర్ అంత సముద్రంలో కలుస్తుంది. ఇక వాటర్ సమస్య నుండి బయటపడటానికి కొత్త ఉపాయం ఆలోచించారు.

టాయిలెట్ నీళ్లను తాగే రోజులు దగ్గరపడ్డాయ్! కంగారుపడకండి.. వాటిని వందశాతం స్వచ్ఛమైన తాగునీరుగా మార్చిన తర్వాతే లెండి! అవును.. ఈ కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన నమూనా కూడా మరో ఏడాదిలో సిద్ధంకానుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అందిస్తున్న నిధులతో మాంచెస్టర్ యూనివర్సిటీ దీన్ని అభివృద్ధి పరుస్తోంది.

టాయిలెట్ల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చే టెక్నాలజీని 2013కల్లా ప్రదర్శించి చూపడానికి నానోటెక్నాలజీ నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'మేం రూపొందించే పరికరంలో బ్యాక్టీరియా, సూక్ష్మ నానో కణాల మిశ్రమం ఉంటుంది. ఇది నీటిలోని హైడ్రోజన్‌ను గ్రహించి, మిగిలినదాన్ని వడపోసి శుద్ధమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో వెలువడే హైడ్రోజన్‌ను రాకెట్ ఇంధనంగా కూడా మార్చుతుంది.' అని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న పరిశోధకులు వివరించారు.

Machine to make drinking water from toilet wasteదీనివల్ల అనేక దేశాల్లో తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తున్న కోట్టాది ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుద్ధమైన నీరు లేక జీవన్మరణ సమస్య ఎదురవుతున్న ప్రాంతాల్లో ఇది మార్పు తీసుకొస్తుందన్నారు. సుమారు రెండు వేల ప్రతిపాదనల్లో నుంచి ఉత్తమమైనదిగా ఎంపికైన ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి తొలి విడతగా లక్ష డాలర్ల సాయం అందింది. తమ ప్రతిపాదన పనిచేస్తుందని వచ్చే ఏడాదిలోగా నిరూపిస్తే గేట్స్ ఫౌండేషన్ నుంచి ఈ పరిశోధక బృందానికి మరో పది లక్షల డాలర్లు అందుతాయి. దీంతో ప్రకృతి వ్యర్థాలను విలువైన వనరుగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఆ బృందం తమ పనిలో నిమగ్నమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gujarat bjp ad depicts narendra modi as lord krishna
Ram charan racha dialogues issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles