Supreme serious on t acts in high court

Supreme Serious On T-Acts In High Court,Telangana stir,Supreme Court,Government-sponsored Vandalism,Andhra Pradesh government,Supreme Court,Enrica Lexie

Supreme Serious On T-Acts In High Court

High.gif

Posted: 04/05/2012 07:06 PM IST
Supreme serious on t acts in high court

తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులకు రక్షణ కల్పించకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో భాగంగా హైకోర్టులో జరిగిన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయ స్థానం తీవ్రంగా స్పందించింది. న్యాయమూర్తులు, న్యాయవాదులను చంపినా చూస్తూ ఊరుకుంటారా? అంటూ ఆగ్ర హం వ్యక్తం చేసింది. తెలంగాణ న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు రక్షణ కల్పించకపోవడం, 'ఇది గూండాయిజం... విధ్వంసం' అని తెలిపింది. దీనిని అడ్డుకోలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. 'హైకోర్టు ఆవరణలో విధ్వంసం సృష్టిస్తున్న వారిని నిలువరించేందుకు మీరేం చేశారు? బదులివ్వండి' అని డీజీపీని, హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీ సింది. ఈ ఘటలపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రార్‌, డీజీపీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టులో జరిగిన విధ్వంసంలో బహుశా... న్యాయవాదులు కాకుండా బయటివారి ప్రమేయం ఉండొచ్చని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా నష్టపోయిందని, ఈ ఉద్యమ నాయకుల నుంచే ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య గతంలో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరిగిన నష్టం వివరాలివ్వాలని ధర్మాసనం గతంలోనే నోటీసులిచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ, హోం శాఖ మాత్రం ఆ నోటీసులకు స్పందించలేదు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు...


*హైకోర్టు ఆవరణలో దీక్ష చేయడానికి న్యాయవాదులకు ఎవరు అనుమతి ఇచ్చారు?
* ఆందోళన చేస్తున్న న్యాయవాదులను కోర్టు ప్రాంగణం నుంచి బయటకు ఎందుకు పంపలేదు?
*కోర్డు గదిలోకి వెళ్లి న్యాయవాదులు గొడవ చేస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* కోర్టు హాలులో న్యాయమూర్తులనే బెదిరించే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
* న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
* హైకోర్టులో జరిగిన సంఘటనలకు సంబంధించి ఎంత మందిని ఆరెస్టు చేశారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Terror leader mocks us come and get me
Janardhan reddy remand extended till april 13  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles