Congress mp chiranjeevi will be the union minister

congress mp chiranjeevi will be the union minister

congress mp chiranjeevi will be the union minister

11.gif

Posted: 04/01/2012 01:18 PM IST
Congress mp chiranjeevi will be the union minister

          chiranjaమెగాస్టార్ చిరంజీవి దశ తిరగబోతోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే చిరు కేంద్రమంత్రి పదవిని అలంకరించబోతున్నారు. హస్తిన లో వేగంగా జరుగుతోన్న పరిణామాలు దీనికి ఊతమిస్తున్నాయి.  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండోదశ మొదలయ్యేలోపే (ఏప్రిల్ 24) ఇటు పార్టీలోను,  అటు కేంద్ర మంత్రివర్గంలోను భారీ మార్పులు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించినట్లు తెలిసింది.
            డీఎంకేకు చెందిన మరో ఇద్దరిని, ఇటీవల రాజ్యసభకు ఎంపికైన చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశాలు మండుగా కనిపిస్తున్నాయి. కొత్తగా,  సమాజ్‌వాదీ పార్టీని కూడా మంత్రివర్గంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.              ఒకే వ్యక్తికి ఒకే పదవి సూత్రం ఆధారంగా బాధ్యతలు కల్పిస్తారని, ఒకరిద్దరు మంత్రులను పూర్తిగా పార్టీకి కేటాయిస్తారని తెలిసింది. గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ పార్టీ బాధ్యతలతో పాటు మంత్రివర్గ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీడబ్ల్యుసీ, పార్టీ ఆఫీసు బేరర్ల పదవుల్లో అన్ని రాష్ట్రాల వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తాజా సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deputy president hamid ansari birth day today
Ias officer srilakshmi and vijayasaireddy remand extend  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles