Lat maar holy

lat maar holi, holi subhakakshalu,Nizamabad district , Bodhan, Hunsa village People, Holi celebrations, Polices, Hanuman Temple, Rod, Middle, game, Maharastar People

lat maar holy,holi subhakakshalu,

holi.gif

Posted: 03/08/2012 10:13 AM IST
Lat maar holy

lat maar holy

holi_subhakakshaluహొలీ పండుగ వస్తోందంటే నిజామాబాద్ జిల్లాలో గుర్తుకు వచ్చేది బోధన్ మండలంలోని హున్సా గ్రామం. ఆ రోజు గ్రామంలో ఒకరినొకరు కొట్టుకుంటూ పిడిగుద్దులాట ఆడటం ఆనవాయితీ. ఎవరూ అడ్డు చెప్పినా ఈ ఆట ఆగదు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించాల్సిందే. పిడిగుద్దులు గుద్దుకోకుంటే గ్రామానికి అరిష్టమని పూర్వకాలం నుంచి స్థానికులు భావిస్తున్నారు. గతంలో ఓసారి ఆడొద్దని నిర్ణయించుకుంటే, అదే రోజు గ్రామంలో అపశృతి చోటుచేసుకుందని, అప్పటి నుంచి ఆ దిశగా ఆలోచించడం లేదని గ్రామస్తులు తెలిపారు. హొలీ రోజున సాయంత్రం గ్రామస్తులంతా గ్రామంలోని హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. రోడ్డుకు మధ్యలో ఒక తాడును కడతారు. రెండు వైపులా కొంత మంది చేరి అరగంట పాటు పిడిగుద్దులతో కొట్టుకుంటారు. ఆట తర్వాత ఒకరిని ఒకరు కౌగిలించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. గాయపడితే దవాఖానకు వెళ్లకుండా రక్తం కారే చోట మట్టితో తుడుచుకుంటారు. ఈ క్రీడను చూడటానికి మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఇప్పటికే గ్రామస్తులు సాధన ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru holi subhakakshalu
Sridhar babu s ingenious twist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles