మన రాజకీయనాయకులు ప్రజలను దేవుడిలా కొలుస్తున్నారంటే నమ్మండి!
దేవుడిని మనం ఇంట్లో పెట్టుకుంటాం కానీ నిత్యపూజలేమీ ఉండవు. మన నిత్యకృత్యాలకు అడ్డురాని ప్రదేశంలో ఉంచుతాం. "నీవే నాకు దిక్కు" అని అంటాం కానీ దేవుడున్న దిక్కు వైపు చూడం. పూజ చేసినా మొక్కుబడే. పుస్తకాల్లో ఉన్న ప్రకారం చేసేస్తాం అంతే. ప్రసాదం నోట్లో వేసుకోగానే పనైపోతుంది. ఇక దేవుడు గుర్తుకు రాడు. ఏదైనా అవసరం పడ్డప్పుడు దేవడు గుర్తొస్తాడు మళ్ళీ. అప్పడు మంచి చేసుకునే దిశగా "నా పని చేసిపెట్టు నీకిన్ని కొబ్బరికాయలు కొడతాం, అన్ని ముడుపులు చెల్లిస్తా"మని అంటాం- దేవుడు మనమేమిస్తామా అని కాచుకుని ఉన్నట్టు! ఇచ్చినా ఏమిస్తాం. సృష్టిలోని వస్తువలను తప్ప మరేమివ్వగలం. అవన్నీ మనకిచ్చిందెవరు? ఆ దేవుడే. సృష్టికర్తే. భక్తాగ్రేసరుడనని అనిపించుకోవాలన్న తపన, దేవుడి దృష్టి పడాలని, కరుణా కటాక్షాలు లభించాలని ఆశ! కానీ అందుకు ఏం చెయ్యాలో అది త్రికరణ శుద్ధిగా చేసే వాళ్ళు చాలా అరుదు. పూజ జరుపుతున్నప్పుడు కూడా ఉన్నవాటితోనే చెయ్యండని పూజారి వరమిస్తారు కానీ మంత్రరూపంలో షోడశోపచారాలు చేస్తూ, "బంగారు ఆసనం మీద కూర్చోబెట్టాం, నీకు సేవలు చేసాం, ఉయ్యాలలూగించాం, ఏనుగునెక్కించాం, ఇదిగో దీపం, అదుగో ప్రసాదం" అని నమ్మబలికి, "తాంబూలమిదిగో, ఉద్వాసనైపోయింది ఇక వేంచేయ్" అంటూ సాష్టాంగపడి వేడుకుంటాం.
ఇదే వింత దేవుడి ఆట మన నాయకులూ మనతో ఆడుకుంటున్నారు. బడ్జెట్ అంకెల్లో ప్రజలకేమి చేసారు, భవిష్యత్తులో ఏమి చెయ్యబోతున్నారన్నది అందంగా ప్రకటిస్తారు. "మిమ్మల్ని ఆదుకుంటాం కానీ అందుకు మాకు భారీగా పన్నులు కట్టండి. నేనే బాగా సేవలందిస్తాను కాబట్టి నాకే ఆ అధికారమివ్వం"డని వేడుకుంటారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ఓటర్లు గుర్తుకురారు. ప్రజాధనంలోంచి ప్రజలకు తాయిలాలు! చెప్పేది ప్రజాసేవ కానీ కావలసింది అధికారం! అంతా సవ్యంగా జరిగితే చూసారా మా గొప్పతనం! ఏదైనా తేడా వస్తే అధికారుల నిర్లక్ష్యం, ప్రతిపక్షాలు గతంలో చేసిన తప్పులు! భక్తులు ఎవరి పద్ధతిలో వారు బొట్లు పెట్టుకున్నట్టు నాయకులకు ఎవరి రంగు ఖండువాలు వారివి. భక్తుడు హుండీలో ఏమేస్తాడా అని దేవుడు ఎదురుచూడనట్టు, ప్రభుత్వం మాకేమిస్తుందా అని ప్రజలు కాచుకుని లేరు. యాచనకాదు సామాన్య ప్రజలు చేసేది. "మాకు పెట్టే ప్రసాదంలో సగం వాటా నీదేననీ తెలుసు, అందుకే నీకిష్టమైన ప్రసాదాన్ని ఇస్తున్నావు. కానీ నిజానికి అదంతా నాదేనని గుర్తుపెట్టుకో"మంటాడు భగవంతుడు. అదృష్టవశాత్తూ ఆ మాటలు మనకు వినపడవు. సర్వసాక్షిగా వ్యవహరించే భగవంతుడు మనమిచ్చే ప్రసాదాలను పట్టించుకోడు. మనసేవలకోసం ముఖంవాచిలేడు!
"హమ్మయ్య ఎన్నికలైపోయాయి కదా, ఊరేగింపులూ విజయోత్సాహాలు అయిపోయాయి కదా, ఇక మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి" అంటాడు సామాన్య మానవుడు. లంచ్ డబ్బా పట్టుకుని తాను పనిచేసే చోటికి పోయి తన పని చేసుకోనిస్తే చాలంటాడు. పూర్వకాలంలో లాగా ఏ దేశం నుంచి ఎవరొచ్చి దోచుకునిపోతారో కనుక మాకు భద్రతను కల్పించండి అని అనటంలేదు. "దేశంలో శాంతిభద్రతలు కాపాడండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి చాలు. అప్పుడు మాకు ఎటువంటి రాయితీలు అవసరం పడదు. ఎటువంటి హామీలు అవసరం లేదు. సృష్టిలోని సంపదంతా మానవుడికి అందుబాటులో ఉన్నట్టుగా, అంతా మీ చేతిలో పెట్టాం మీకేం కావాలో మీరు తీసుకోండి కానీ మమ్మల్ని మా పనులు చేసుకోనివ్వండి" అంటాడు, దేవుడి స్థానంలో కూర్చోబెట్టబట్టి క్షమాగుణం, వరాలిచ్చే ఔదార్యం ఉన్న సామాన్య మానవుడు.
(నిజమైన భక్తులు కూడా ఉన్నారు సుమా. వాళ్ళు ఎవరితోనూ పోటీ పడరు. అయితే వాళ్ళు ఛాదస్తులు, తెలివితక్కువవారు, లౌక్యం తెలియని అమాయకులుగా పరిగణించబడతారు)
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more