Jp says it is not a law but a street rowdy action

jp says it is not a law but a street rowdy action, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

jp says it is not a law but a street rowdy action, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

jp-1.gif

Posted: 02/18/2012 01:34 PM IST
Jp says it is not a law but a street rowdy action

jp

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, వ్యవసాయరంగంలోని సంక్షోభం కేవలం ప్రభుత్వ పాపాల వలన వచ్చిందే కానీ ప్రకృతి వైపరిత్యాల వలన కాదని, రైతులకు న్యాయం జరగటం కోసం, వినియోగ దారులకు ధరలు స్థిరంగా ఉండటం కోసం, చట్టవిరుద్ధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ప్రతిఘటిస్తున్నామని అన్నారు. 82 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం పేరుతో అప్పటి విదేశీ ప్రభుత్వ అధర్మ నియమాలను ఉల్లంఘించి న్యాయాన్ని స్థాపించారని, ఇప్పుడు అలాంటి ఉద్యమంతోనే రైతులు స్వచ్ఛందంగా వారికి లాభదాయకమైన ధర వచ్చే ప్రాంతంలో అమ్ముకోవటానికి వీలుగా ధాన్యాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించటాన్ని చట్ట విరుద్దం చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ ఈ ఉద్యమం ప్రారంభించామని, ప్రభుత్వం తన విధానాన్ని సవరించుకుంటుందో లేకపోతే అక్రమ పాలనలో విదేశీ ప్రభుత్వానికేమీ తీసిపోమని నిరూపించుకుంటుందో వారి ఇష్టమంటూ చెప్పుకొచ్చారు రైతులతో కలిసి 35 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్న జయప్రకాశ్ నారాయణ.

మరి మీరు చట్ట సభల్లో ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్నారు, మీరే ఇలా చట్టాన్ని ఉల్లంఘించటం సరియైనదేనా అని అడిగిన ప్రశ్నకు, ఇది ప్రజాహితంలో చేసిన చట్టం కాదని, ఇతర ఉత్పాదనల్లాగానే ధాన్యాన్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చునని, ఆ నియమాన్ని తుంగలో తొక్కి, కేవలం కొందరు దళారులు, మిల్లర్ల కడుపు నింపటం కోసం పేద రైతు కడుపు కొడుతున్న ప్రభుత్వం బజారు రౌడీలా వ్యవహరిస్తోందని, బజారు రౌడీలు చేసినదాన్ని చట్టమనరని, కేవలం రౌడీయిజమేనని, అందుకే ఈ అక్రమ నిబంధనల కట్లు తెంపుకుని రైతాంగమంతా పొరుగు రాష్ట్రంలో అమ్మకాలకు తరలి వెళ్తోందని జెపి అన్నారు.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  10 lakhs reward announced by cbi on fugitive ips
Indian scientist maiden international award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles