ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ విమానాశ్రయాల్లో హైద్రాబాద్ 3 వ స్థానాన్ని ఆక్రమించిందంటే రాష్ట్ర ప్రజల హృదయం ఉప్పొంగటం సహజం. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసిఐ) ప్రకటించటం ఇంకా ఆనందదాయకం. ఏసిఐ 179 దేశాల్లోని 1650 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న 580 సంస్థలకు ప్రాతినిధ్యం ఉంది. అన్నిటిలో 3 వ స్థానాన్ని పొందటం హైద్రాబాద్ కి గర్వకారణమే. ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎమ్ ఆర్ సంస్థకీ ఆ ఘనత దక్కుతుంది. అబుదాబి, అడిలైడ్, జెనీవా, కేప్ టౌన్, హంబర్గ్, లండన్ లోని లూటన్ లాంటి విమానాశ్రయాలను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని సంపాదించింది. విమాన ప్రయాణీకులకు ఉన్నతమైన సేవలనందించే నిర్వాహక సంస్థలకీ గుర్తింపు లభిస్తుందని జిఎమ్ఆర్ సంస్థ తెలియజేసింది.
అయితే ఆగండి, సంబరం ఎంత చేసుకోవాలో అంతే కదా. క్రీడల్లో ఏ ఏజ్ గ్రూప్ కి దానికి విడివిడిగా పోటీలు పెట్టినట్టు, 50 లక్షల నుంచి కోటి మంది విమాన ప్రయాణీకులు ఉపయోగించుకునే విమానాశ్రయాల వర్గంలో ప్రపంచస్థాయిలో 3 వ స్థానం అన్నది కూడా గుర్తుంచుకోవాలి.
అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అత్యధిక విమాన ప్రయాణీకుల రద్దీ కలిగివున్నదిగానూ, లండన్ లోని హిత్రో విమానాశ్రయం సాలీనా అత్యధిక అంతర్జాతీయ విమాన ప్రయాణీకులను కలిగివున్నదిగానూ, జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం అత్యధిక విమానాశ్రయాలకు వెళ్ళే సేవలందించేదిగానూ, హాంగ్ కాంగ్ విమానాశ్రయం అత్యధిక కార్గో ని రవాణా చేసేదిగానూ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలిగివున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more