20 injured in police firing as violence grips yanam

Leaders added fuel to Yanam fire,20 injured in police firing as violence grips Yanam,Violence rocks Yanam, workers kill company official

Leaders added fuel to Yanam fire

Yanam fire.gif

Posted: 01/28/2012 10:26 AM IST
20 injured in police firing as violence grips yanam

Leaders added fuel to Yanam fire  పచ్చగా ప్రశాంతంగా ఉండే యానాం రణరంగమైంది. కార్మికులకు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య వివాదం, అందులో పోలీసు యంత్రాంగం చొరబాటు.. పట్టణాన్ని రణరంగం చేసింది. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. 20 మందిని ఆస్పత్రిపాల్జేసింది. పోలీసు కస్టడీలో ఉన్న తమ నేత మరణించడంతో ఆగ్రహోదక్షిగులైన రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ కార్మికులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడంతో రాజుకున్న చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్, కాల్పులతో ఫ్యాక్టరీలో విధ్వంసకాండకు దారి తీసింది. తమ నేత మరణానికి కారకుడయ్యారంటూ కంపెనీ వైస్‌చైర్మన్‌పై కార్మికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన.. ఆస్పవూతిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కార్మికులను చెదరగొ పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు.

వీరిలో 11 మందిని సమీపంలోని కాకినాడకు తరలించి చికిత్స చేస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్మిక నేత మృతి, పోలీసుల కాల్పులతో పట్టరాని ఆగ్రహానికి గురైన కార్మికులు రీజెన్సీ ఫ్యాక్టరీకి నిప్పుపెట్టారు. ఆ కంపెనీకి సంబంధించిన వాహనాలతో పాటు 50కి పైగా లారీలు, ఇతరత్రా వాహనాలను తగలబెట్టారు. రీజెన్సీ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే కాలేజీని, ఫ్యాక్టరీలోని సిరామిక్ టైల్స్ తదితరాలను ధ్వంసం చేశారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనల నేపథ్యంలో యానాంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు ఆంధ్రవూపదేశ్ నుంచి ప్రత్యేక బలగాలు యానాంకు తరలి వెళ్లాయి.

పుదుచ్చేరి రాష్ట్రంలో భాగమైన యానాం.. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణానికి నెలవు. రీజెన్సీ సిరామిక్స్ అనేది యానాంలోనే అతిపెద్ద పారిక్షిశామిక యూనిట్. ఇందులో మొత్తం 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో 200 మంది కాంట్రాక్ట్ కార్మికులే. తమలో పదిహేనేళ్ల సర్వీసు ఉన్నవారిని అయినా పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని కోరుతూ జనవరి 1 నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. వీరిలో ఫ్యాక్టరీ కార్మిక సంఘం వ్యవస్థాపక నేత మురళీమోహన్ (36) సహా 300 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి యాజమాన్యం తొలగించింది. సమ్మె చేస్తున్న కార్మికులు ఫ్యాక్టరీ చుట్టుపక్కల 200 మీటర్ల పరిధిలో ఉండరాదని మద్రాస్ హైకోర్టు నుంచి ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదేశాలు తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మురళీ మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాత్రంతా ఆయనను స్టేషన్‌లో ఉంచారు. శుక్రవారం తెల్లవారుజామున 6గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. కొద్ది మంది కార్మికులతో కలిసి ఆయన ఫ్యాక్టరీకి చేరుకున్నారు. ఉదయం షిఫ్ట్‌లో పని చేస్తున్న కార్మికులను కలిసి, డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ విధులు బహిష్కరించాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

లాఠీలతో మురళీమోహన్, ఇతర కార్మికులపై విరుచుకుపడ్డారు. లాఠీచార్జ్‌లో తీవ్రంగా గాయపడిన మురళీమోహన్, మరికొందరు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి, తొలుత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన తనకు గుండె నొప్పిగా ఉందని చెబుతూ కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పవూతికి తరలించారు. అయితే అప్పటికే మురళీమోహన్ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. కార్మిక నేత చనిపోయిన వార్త ఫ్యాక్టరీ కార్మికుల్లో దవానలంలా పాకింది. పోలీసులు కొట్టిన దెబ్బలకే తమ నేత చనిపోయాడని ఆరోపిస్తూ కార్మికులు తీవ్ర ఆగ్రహోదక్షిగులయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

మురళీమోహన్ మృతికి కారకులైన పోలీసులు, రీజెన్సీ సిరామిక్స్ యాజమాన్యంపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కోపంతో పోలీస్ స్టేషన్‌పై రాళ్లు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో కార్మికులను చెదరగొ లాఠీలకు పని చెప్పారు. కార్మికులు ప్రతిఘటించడంతో నేరుగా కాల్పులకే పాల్పడ్డారు. ఈ కాల్పులు, లాఠీచార్జిలో 20 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. ఇదే సమయంలో మరొకొందరు కార్మికులు ఫ్యాక్టరీ బయట నిరసనకు దిగారు. వారిలో దాదాపు వంద మందిని పోలీసులు అరెస్టు చేయడంతో కార్మికులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. మరికొందరు కంపెనీ నిర్వహిస్తున్న కాలేజీ వైపు దూసుకుపోయారు. కొద్ది మంది కార్మికులు యానాం టౌన్ సెంటర్‌లో ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య యుద్ధమే జరిగింది. కార్మిక నేత మృతివార్తతో కార్మికులు కంపెనీకి చెందిన దాదాపు 50 బస్సులు, లారీలను దహనం చేశారు. కొంతమంది కార్మికులు రీజెన్సీ సిరామిక్స్ కంపెనీ చైర్మన్ అల్లుడు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) అయిన కేసీ చంద్రశేఖర్ ఇంటిపై దాడి చేసి, ఆయన్ను చితకబాదారు. తలకు తీవ్ర గాయాలైన చంద్రశేఖర్‌ను కాకినాడలోని అపోలో ఆస్పవూతికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూనే చనిపోయారు. పోలీసుల కాల్పులతో మరింత రెచ్చిపోయిన కార్మికులు ఫ్యాక్టరీపై దాడి చేసి, దానిని తగులబెట్టారు. వీరికి స్థానిక ప్రజలు కూడా మద్దతుగా నిలిచారు. ఫ్యాక్టరీలోని సిరామిక్ టైల్స్‌ను ధ్వంసం చేశారు.
కంపెనీ కార్యాలయంలోని కంప్యూటర్లు, టైల్స్‌ను ఎత్తుకుపోయారు. కంపెనీకి చెందిన దాదాపు 40కిపైగా బస్సులు, లారీలను తగలబెట్టారు. పలు ద్విచక్షికవాహనాలు సైతం దహనమయ్యాయి. కంపెనీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని తెలియడంతో దాదాపు వందమంది పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ కార్మికులతో తలపడ్డారు. వారిని చెదరగొ కాల్పులకు దిగారు. ఒక్కసారిగా యానాం ఉద్రిక్తంగా మారిపోవడంతో దుకాణాలు మూతపడ్డాయి. ఇదే సమయంలో కొందరు అగంతకులు దుకాణాలపై పడి లూటీ చేశారు. పెద్ద సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అయినా సాయంత్రం వరకూ ఫ్యాక్టరీ నుంచి పొగలు వెలువడుతూనే ఉన్నాయి.

పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అదనపు బలగాలను పంపాలని యానాం అధికార యంత్రాంగం ఆంధ్ర్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అదనపు బలగాలను హుటాహుటిన యానాంకు తరలించారు. పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. ఫ్యాక్టరీ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణంలో టీవీ ప్రసారాలను నిలిపివేశారు. కార్మికులు కేబుల్ టీవీ కార్యాలయానికి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రసారాలు పునరుద్ధరించారు. కాల్పులకు నిరసనగా అన్నాడీఎంకే నేత శ్రీహరి.. యానాం ప్రభుత్వ ఆస్పవూతిలో నిరశనదీక్షకు కూర్చున్నారు. రీజెన్సీ కార్మికులపై లాఠీచార్జ్, కాల్పులపై ఆ ఫ్యాక్టరీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One more statue destruction incident at tenali
Vasant panchami special pooja at basara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles