Union minister jai ram ramesh

union minister jai ram ramesh statement about social service in an occasion in new delhi

union minister jai ram ramesh statement about social service

6.gif

Posted: 01/21/2012 04:04 PM IST
Union minister jai ram ramesh

  7మతం గోల పక్కనపెట్టి సేవ చేయటంలో అగ్రభాగాన నిలవాలని క్రైస్తవ మిషనరీలకు కేంద్రమంత్రి జైరాం రమేష్ పిలుపునిచ్చారు. మావోయిస్టు ప్రాంతాల్లో జరుగుతోన్న అభివ్రుద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. అయితే మతపరంగా ఎవరినీ ప్రభావితం చేయరాదని, లక్ష్మణ రేఖ దాటరాదని కోరారు.

ఇవాళ ఢిల్లీలో ఆయన ఆర్చ్ బిషప్ లు, బిషప్ లు, క్యాథలిక్ మత గురువులను ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ‘దైవ ప్రేమను పొందిన వారు (కారిటాన్) ను క్యాథలిక్ సంస్థగా చూడటంలేదని, ఒక సేవా సంస్థగా మాత్రమే చూస్తున్నానని పేర్కొన్నారు. ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, జార్కండ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ సమస్యతో సతమతమవుతున్నాయని ఆయా ప్రాంతాల్లో కారిటాన్, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని జైరాం రమేష్ కోరారు.

సామాజిక, మత సంస్థలు అభివృద్ధిని అడ్డుకోకూడదన్నారు.  కుడంకుళం అణువిద్యుత్ సంస్థను, మేఘాలయలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటున్నారని ఇది కూడదన్నారు. ఇలా పర్యావరణం పేరిట అన్నింటినీ వ్యతిరేకిస్తూ పోతే రానున్న కాలంలో విద్యుత్ అవసరాలు ఎలా తీరతాయని రమేష్ ప్రశ్నించారు.

                                                                                                ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desem party chief nara chandra babu naidu
Mp modugula comments on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles