విశ్వవ్యాప్తంగా ఎంతో సమాచారాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు అందించే వికిపిడియా రేపు 24 గంటల పాటు సమ్మె చేస్తోంది. వికిపీడియా తెరిచినట్లయితే, రేపంతా వికిపీడియా మామూలుగా ఇచ్చే సమాచారం స్థానంలో ఆన్ లైన్ పైరసీ యాక్ట్, ప్రొటెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ ల వివరాలు మాత్రమే లభ్యమౌతాయి.
అమెరికా లో ప్రతిపాదించిన పైరసీ వ్యతిరేక చట్టం వలన ఇంటర్ నెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడబోతున్నదని భావిస్తూ, ఈ విషయాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేస్తూ, ఇంటర్ నెట్ వినియోగదారులలో చైతన్యం తేవటం కోసం 24 గంటలపాటు వికిపీడియా కి విరామం ఇస్తున్నట్టుగా వికిపీడియా సంస్థాపకుడు జిమ్మీ వేల్స్ ప్రకటన చేసారు. ఈ చట్టమే గనక అమలులోకి వస్తే, అందరికీ అందుబాటులో ఉన్న ఇంటర్ నెట్ కి గొళ్ళాలు, తాళాలు, ఇతర దేశాల వివరాల విషయంలో ఆంక్షలు పెట్టటం కోసం ప్రత్యేకంగా టూల్స్ తయారు చెయ్యటం జరుగుతుందన్నది జిమ్మీ వేల్స్ వాదన.
వికిపీడియా సేవలను నిలిపివేయటం ఇది రెండవసారి. ఇంగ్లీషు సైట్ కి మొదటిసారైనా అంతకు ముందు ఇంటర్ నెట్ సెన్సార్ షిప్ ని ప్రతిపాదించిన బెర్లూస్ కోనీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇటాలియన్ సైట్ ని నిలిపివేయగా, ఆ ప్రతిపాదన ముందుకు పోకుండా ఆగిపోయింది. వికిపీడియాను నిలిపివేసిన సమయంలో, అమెరికాలోని ఇంటర్ నెట్ అభిమానులను అక్కడి కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెస్తూ మెయిల్స్ పంపించమని జిమ్మీ వేల్స్ కోరుతున్నారు.
వికిపీడియా మీద ఎంతో మంది ఆధారపడ్డరిప్పటికే. పైరసీ వ్యతిరేక చట్టాలు అమలు లోకి రాగానే కొన్ని సైట్ల మీద నిషేధాఙలు కూడా రావొచ్చు. అందువలన, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సంస్థలు వ్యతిరేకిస్తూ ఎంతోమంది ఉపాధులకు ఇది ఎసరుపెడుతుందనే భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ చట్టాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా బృందం కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ, ఆ చట్టాలకు మద్దతునిస్తున్న కాంగ్రెస్ తో మాట్లాడి, పైరసీ ని అడ్డుకుంటూనే వాక్కు పత్రికా స్వాతంత్ర్యాలకు భంగం కలుగని విధంగా వాటిని సవరించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more