మనదేశంలో ఇంటికి వచ్చినవాళ్ళకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చినట్టు విదేశాలలో కొత్తగా వచ్చిన అతిథులకు ఇంటిలోని బాత్ రూంలాంటి సౌకర్యాలు చూపించే ఆనవాయితీ ఉంది. ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల భోజనసమయంలో ఇంటికి వచ్చినవారికి తమకున్నదాంట్లో సర్దుతూ వారికి పెట్టే అలవాటుంది. టీ ఇవ్వటమైతే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ మామూలైపోయింది. అయితే, టీ ఇవ్వకపోయినా, తినటానికి పెట్టకపోయినా, బయట ఆహార పదార్థాలు విరివిగా దొరుకుతున్న తరుణంలో ఆ అవసరాన్ని ఎలాగైనా తీర్చుకోగలుగుతారు. కానీ అంతే అవసరమైన శౌచం, విసర్జనల విషయంలో చాలాకాలం మనవాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే నగరాల్లో మలమూత్ర విసర్జనలకు రుసుం చెల్లించి ఉపయోగించుకోగలిగే అవకాశాన్ని కలిగించారు. దీనితో నగరానికి వచ్చిన సందర్శకుల అవసరం తీరటమే కాకుండా నగరం కూడా పరిశుభ్రంగా ఉంటుంది.
అయితే ప్రతిరోజూ వచ్చే సందర్శకుల కోసం తిరుపతి లాంటి చోటైతే ఏర్పాట్లు బాగానే జరిగాయి, ఇంకా అభివృద్ధి చెందుతూనేవుంది కానీ సంవత్సరానికి ఒకటో రెండో సార్లు వచ్చే శ్రీశైలం, భద్రాచలం, మేడారంలాంటి చోట్ల జనానికి కావలసిన మౌలిక సదుపాయాలు కరువై ఆ రెండు మూడు రోజులూ తీర్థ స్థలాలను అపరిశుభ్రం చేసిపెడతారు. దీన్ని అధిగమించటానికి ఈ సంవత్సరం మేడారం జాతరలో 200 సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిర్వహించే భూటాని ఇంటర్నేషనల్ సంస్థ ఢిల్లీకి చెందింది. ఇంతవరకూ ఈ సంస్థ సేవలు ఉత్తర భారతానికే పరిమితమై ఉంది. మొదటిసారిగా వింధ్యపర్వతాలు దాటి దక్షిణభారతంలోకి తమ సేవలను విస్తరిస్తున్న ఈ సంస్థ కంప్యూటర్ సాయంతో ఆన్ లైన్ నియంత్రణతో సేవలను నిర్వహిస్తుంది. వీటిని ఉపయోగించుకునేవారు తలకి 30 రూపాయల చొప్పున చెల్లించవలసివుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more