ఈ వారం 'లెజెండ్స్...' లో మనం గుర్తు చేసుకోడానికి ఎందరో మహానుభావులు. తమదైన శైలి లో అందరిని అలరించి, మెప్పించిన, మెప్పిస్తూ ఉన్న హీరోస్ వీరు. ప్రేక్షకులని తమ విద్యతో ఎలా కట్టిపడేయాలో ఎవరైనా వీరి నుండి నేర్చుకోవాల్సిందే. ఒకరు హాస్య రసం పండించడంలో నిష్ణాతులైతే, మరొకరు ప్రపంచమే గర్వించదగ్గ సంగీత రాజు, ఇంకొకరు తన స్టయిల్ లో సంగీతాన్ని అందిస్తున్న నైపున్యవంతుడు. వీరంతా మనకి సుపరిచితులే...
'నవ్వడం. నవ్వించడం ఒక భోగం... నవ్వలేక పోవడం ఒక రోగం'... అని నమ్మడమే కాకుండా, తన సినిమాల ద్వారా ఈ నిజాన్ని మనం కూడా నమ్మేలా చేసి, హాస్య రసాన్ని పండించడంలో 'లెజెండ్' గా నిలిచిన 'స్వర్గీయ' జంధ్యాల జయంతి నిన్న. ఇప్పటికి మనం సంతోషంగా ఉండటానికి, ఈయన సినిమాల రూపం లో మనకి ఇచ్చిన 'హ్యాపి' టానిక్ లు వాడతాం. ప్రతీ మనిషిలో ఉండే అతి జాగ్రత్త పీనాసితనంగా మారితే అది దేనికి దారి తీస్తుందో చుబించే ఆహా నా పెళ్ళంట, మెగా స్టార్ చిరంజీవిని కొత్త కోణం లో చూబించిన చంటబ్బాయి వంటి ఎన్నో సినిమాలు తీసి, బ్రమ్హానందం, శ్రీ లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రాళ్ళ పల్లి వంటి ఎందరో నటులకు సిని రంగం లో పేరుని, పనిని ఇప్పించిన ఘనత జంధ్యాలదనే చెప్పాలి. తను చదువుకునే రోజుల నుండి, నాటక రంగం లో ప్రవేశం పొంది, తరువాత రచయితగా ఎదిగి, దర్శకత్వం వైపు అడుగులు వేసి, తను చుబించాలనుకున్న ప్రతీ అంశాన్ని హాస్యంతో మేళవించి తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని దర్శకునిగా నిలిచినా 'లెజెండ్' జంద్యాల...
ఇక ఎ.ఆర్. రెహమాన్... కీ బోర్డు ప్లేయర్ దిలీప్ నుండి, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ గా ఎదగడానికి, ఈ 'లెజెండ్' చాలానే కష్టపడవలసి వచ్చింది. ఇళయరాజా, రాజ్ కోటి వంటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డు ప్లేయర్ గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన దిలీప్ టాలెంట్ ని ఇంకొక అభిరుచి గల దర్శకుడు, మణి రత్నం గుర్తించి, ఎ.ఆర్. రెహమాన్ గా మార్హి, 'రోజా' తో సంగీత దర్శకునిగా అవకాసం ఇచ్చారు... అంతే, ఇక రెహమాన్ ఖ్యాతి అంచలంచెలుగా పెరగ సాగింది... జెంటిల్ మ్యాన్, ప్రేమికుడు, జీన్స్, వంటి ఎన్నో చిత్రాలకి ప్రాణం రెహమాన్ సంగీతం. ఈ మధ్యనే వచ్చిన ఎం మాయ చేసావే విజయం వెనుక కూడా, రెహమాన్ సంగీతమే మూల కారణం... ఇక 'స్లం డాగ్ మిలినియర్' తో ప్రపంచం గర్వించదగ్గ సంగీత దర్శకునిగా ఎదిగారు రెహమాన్... ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు రెహమాన్... ఆయన పుట్టిన రోజు, జనవరి 6...
ఇక 'ఆరంజ్ ' సినిమాలో పాటలు ఎంతటి ఘన విజయాన్ని సాదించాయో మనందరికీ తెలిసిందే. ఒక సినిమాలోని పాటలన్నీ విజయం సాధించడం ఈ మధ్య కాలం లోనే చాల అరుదుగా చూస్తున్నాం. కాని 'హర్రిస్ జయరాజ్' సంగీతం ఈ అరుదైన సిశాయాన్ని సాధ్యం చేసింది. అటు సెవెంత్ సెన్స్' తీసుకున్న, గజని ని గుర్తు చేసుకున్న, మాటల మాంత్రికుడు 'హర్రిస్ జయరాజ్' పాత్ర ఈ సినిమాల విజయం లో ఎంతో ముఖ్యం. తు తమిళం లో, ఇటు తెలుగులో తిరుగులేకుండా దూసుకుపోతూ, మరిన్ని పాటలతో ఈ కొత్త సంవత్సరం, మనల్ని అలరించబోతున్నారు హర్రిష్... మరి ఈ యువ 'లెజెండ్' పుట్టిన రోజు, జనవరి 8...
ఇలా, సిని ప్రపంచం లో చెప్పుకోదగ్గ మహానుభావులు ఎందరో... వారందరికీ వందనం తెలుపాలన్న ఉద్దేశమే ఈ లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా'...
-సునయన వినయ్ కుమార్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more