Change in regular programs at tirumal due ot new year

tirupati-balaji1.gif

Posted: 12/31/2011 11:56 AM IST
Change in regular programs at tirumal due ot new year

tirupati-balajiఈ ప్రపంచంలో మనం చెప్పే మాటను మారుచెప్పకుండా వినేవాడు ఒక్కడే- దేవుడు! ఎప్పుడైనా పూజ చెయ్యవచ్చు, ఎప్పుడైనా అభిషేకం చెయ్యవచ్చు, మన ఇష్టమొచ్చిన వస్త్రాలను, అలంకారాలను చేసి, మన ఇష్టమొచ్చిన విధంగా ఊరేగింపు చెయ్యవచ్చు. పేరుకి సేవ. కానీ చేసేది మాత్రం మన అభీష్టం ప్రకారం. సంపదగల భక్తుడు, అధికారంలో ఉండే భక్తులు, పేరు గల భక్తులు వచ్చినప్పుడు మన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటాం.

రేపు జనవరి ఒకటి, ఇంగ్లీషు సంవత్సరాది. ఈ సందర్భంగా తిరుమల వేంకటేశ్వరుని ఆర్జిత సేవలు రద్దు చేసి కార్యక్రమాల్లో మార్పులు చేసారు. సుదర్శన టోకన్లు రద్దు. సర్వదర్శనం 4 గంటల నుంచే ప్రారంభం. ప్రముఖులకు తెల్లవారు ఝామున 2 నుంచి 4 వరకు ప్రత్యేక దర్శనం. ప్రముఖులకు నిర్వచనం ఆలయ యాజమాన్యానికే తెలుసు. ఈ ప్రముఖులు ఎప్పుడు పడితే అప్పడు దర్శనమివ్వరెవరికీ. కానీ వీరికి ఆలయ యాజమాన్యం చెప్పినప్పుడు దేవదేవుడి దర్శనం మాత్రం జరుగుతుంది.

నిత్య సేవలు, ప్రత్యేక సేవలు, మందిర నిర్మాణాలకు మనకి ఎన్నో నియమాలున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తారు. కానీ అర్థం పర్థం లేని నూతన సంవత్సరమైన జనవరి 1కి ఏమేం చెయ్యాలన్నది మన శాస్త్రాల్లో లేకపోయినా, దేవుడు నోరు విప్పి ఏమీ అనడు కాబట్టి మనిష్టమే పనిచేస్తుంది. మన దేశ పండుగలకు ప్రతి దానికీ అర్థముంది, ఆయా దినాలకు ప్రత్యకత ఉంది. కానీ జనవరి 1కి ఎటువంటి విశేషమూ లేదు. కొందరు తాగుబోతులు కలిసి తాగటానికి వీలుగా చేసుకున్న ఏర్పాటే నూతన సంవత్సర వేడుకలు. కానీ ఎక్కువ మంది ఏది అంటే అదే జరుగుతుంది కదా. అందుకే దేవుడు అభ్యంతరమేమీ చెప్పడు.

ఏదో ఒక రోజున వైన్, బ్రెడ్ లను తీర్థ ప్రసాదాలుగా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. కాకపోతే ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎంత కుంభకోణం జరిగిందన్నది బయటకొచ్చి సంచలనాన్ని సృష్టించవచ్చు.

ఒకప్పుడు దేవుడికి రోజులో చేసే ఆఖరు సేవ- పవళింపు సేవ అయిపోయిన తర్వాత తలుపులు మూసేటప్పుడు ఆ తలుపులుకున్న చిరుగంటలు శబ్దం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ వాటిని మూసేవారు. ఆ తర్వాత భక్తులంతా సవ్వడి చెయ్యకుండా ఆలయంలోంచి నిష్క్రమించేవారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nri gets rare british knight hood
Dresses reason for rap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles