లోక్ పాల్ బిల్లు మీద తుది నిర్ణయం తీసుకోవటం కోసం ఈ రోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగబోతోంది. అందులో కీలకమైన లోక్ పాల్ బిల్లు లోని వివాదాత్మక అంశాలను చర్చించి వాటి పట్ల ప్రభుత్వం తమ అంతిమ నిర్ణయానికి ఈ రోజు రాబోతున్నది. ఇదే కాకుండా సమావేశాల కొనసాగింపులో 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించే దిశగా కూడా ప్రభుత్వం యోజన చేస్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ఈరోజు మంత్రి వర్గ సమావేశంలో తీసుకుంటారు.
సమావేశాల సమయమా చిక్కిపోయి చివరి దశకు వస్తోంది. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టకపోతే దీక్ష చేస్తానని భీష్మించుకుని అన్నా హజారే కూర్చున్నారు. ఈ సందర్భంలో ఏ పని చెయ్యాలో ఏది వద్దో అన్న విషయంలో ప్రభుత్వం గందరగోళ స్థితిలో ఉందనే చెప్పాలి. కనీసం బిల్లుని ప్రవేశపెడితే, ఆమాట చెప్పటానికైనా ఉంటుంది.
ఈ గందరగోళంలో తెలంగాణా సమస్య కూడా వేడి పుట్టించకుండా రాష్ట్రంలో సమ్మె ఆగిపోవటంతో ఊపిరి పీల్చుకుంటున్నా, ఆ సమస్య కూడా పూర్తిగా అణిగిపోలేదు. ఆ ప్రస్తావన రాకపోతే వారూ ఊరుకోరు. కానీ ముందుగా అన్నా కత్తి మెడ మీద వేళ్ళాడుతూ కనిపిస్తోంది. దాన్నుంచి రక్షించుకోవటం ప్రభుత్వానికి చాలా ముఖ్యం. ఎందుకంటే అన్నా హజారేకి వస్తున్న మద్దతు రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. దానికి తోడు ఆయన ప్రభుత్వానికి ఎక్కడా దొరక్కుండా వ్యూహం పన్నుతూ ముందుకెళ్తున్నారు. తనకోసం ఏదైనా ఆశించేవారిని నయానో భయానో బుజ్జగించో బులిపించో దారికి తెచ్చుకోవచ్చు కానీ తనకంటూ ఏమీ ఆశించకుండా సమాజ సేవకోసమే అంతా చేసేవారితో వేగటం కష్టమేనని ప్రభుత్వం తలవంచుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more