T congress mps write to sonia

Telangana, Congress, MPs, Congress, leadership, Congress president, Mrs Sonia Gandhi, Naidu,Telangana hotspots · T-Cong, MPs, Sonia.

The Telangana Congress MPs on Tuesday obstructed proceedings in the the Lok Sabha by holding placards and raising slogans.

T-Congress MPs write to Sonia.GIF

Posted: 12/14/2011 10:11 AM IST
T congress mps write to sonia

T.congress-MPsప్రత్యేక రాష్ట్రం కోసం పదవులను వదిలి పెట్టకుండా తనదైన శైలిలో పోరాడుతూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సహనం నశించినట్లు ఉంది. ఇన్ని రోజులు ఓపికతో అమ్మకే వంతన పాడుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమోకానీ ఒక్కసారిగా అమ్మపైనే ధిక్కార స్వరం వినిపించారు. ధిక్కార స్వరమే కాకుండా ఏకంగా హెచ్చరించే స్థాయికి వెళ్ళారు.

తాజాగా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నారని వస్తున్న వార్తల పై వీరు స్పందించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాకుండా అభివృద్ధి మండలి, ప్యాకేజీ లాంటివి ప్రకటిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. అధ్యక్షురాలు సోనియాగాంధీని హెచ్చరిస్తూ తనదైన శైలిలో వాక్బాణాలు సందిస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. తుఫాను ముందు ప్రశాంతత లాంటిదే నెలకొన్నదని, తగిన నిర్ణయం తీసుకోకపోతే తుఫాను రాక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు

ఇన్ని రోజులు అమ్మ సలహా మేరకే, ఆమె పై ఉన్న నమ్మకంతోనే సభాకార్యకలాపాలు అడ్డుకోకుండా కేవలం ఆమె దృష్టిని ఆకర్షించేందుకు లాంఛనంగా నిరసనలు తెలుపుతున్నామని, అంత మాత్రాన  మీరు మమ్మల్ని తక్కువగా చూస్తూ వీరు ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంత మాత్రాన మాలో తెలంగాణ భావం తగ్గిపోయినట్లు కాదని వారు స్పష్టం చేశారు. తెలంగాణకోసం ఎంత ఉద్యమిస్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకోసం నిలబడ్డారన్న విషయాన్ని ప్రశంసించాలని సోనియాకు తెలిపారు. డిసెంబర్ 9న హోం మంత్రి ప్రకటనను తాను అంగీకరించలేదని రోశయ్య చెప్పడం, కిరణ్ సర్కార్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అరెస్టు చేయడం, వందలాది విద్యార్థులను జైలు పాలు చేయడం, కాంగ్రెస్‌తో పాటు నాలుగు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పలేదని హోంమంత్రి చిదంబరం చెప్పడంతోనే తాము పార్లమెంట్‌లో నిరసన తెలుపాల్సి వచ్చిందని టీ ఎంపీలు సోనియా దృష్టికి తీసుకువచ్చారు. మరి ఈ లేఖ పై అమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ప్రత్యేక రాష్ట్రం కోసం పదవులను వదిలి పెట్టకుండా తనదైన శైలిలో పోరాడుతూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సహనం నశించినట్లు ఉంది. ఇన్ని రోజులు ఓపికతో అమ్మకే వంతన పాడుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమోకానీ ఒక్కసారిగా అమ్మపైనే ధిక్కార స్వరం వినిపించారు. ధిక్కార స్వరమే కాకుండా ఏకంగా హెచ్చరించే స్థాయికి వెళ్ళారు.

తాజాగా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నారని వస్తున్న వార్తల పై వీరు స్పందించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాకుండా అభివృద్ధి మండలి, ప్యాకేజీ లాంటివి ప్రకటిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. అధ్యక్షురాలు సోనియాగాంధీని హెచ్చరిస్తూ తనదైన శైలిలో వాక్బాణాలు సందిస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. తుఫాను ముందు ప్రశాంతత లాంటిదే నెలకొన్నదని, తగిన నిర్ణయం తీసుకోకపోతే తుఫాను రాక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు
ఇన్ని రోజులు అమ్మ సలహా మేరకే, ఆమె పై ఉన్న నమ్మకంతోనే సభాకార్యకలాపాలు అడ్డుకోకుండా కేవలం ఆమె దృష్టిని ఆకర్షించేందుకు లాంఛనంగా నిరసనలు తెలుపుతున్నామని, అంత మాత్రాన  మీరు మమ్మల్ని తక్కువగా చూస్తూ వీరు ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంత మాత్రాన మాలో తెలంగాణ భావం తగ్గిపోయినట్లు కాదని వారు స్పష్టం చేశారు. తెలంగాణకోసం ఎంత ఉద్యమిస్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకోసం నిలబడ్డారన్న విషయాన్ని ప్రశంసించాలని సోనియాకు తెలిపారు. డిసెంబర్ 9న హోం మంత్రి ప్రకటనను తాను అంగీకరించలేదని రోశయ్య చెప్పడం, కిరణ్ సర్కార్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అరెస్టు చేయడం, వందలాది విద్యార్థులను జైలు పాలు చేయడం, కాంగ్రెస్‌తో పాటు నాలుగు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పలేదని హోంమంత్రి చిదంబరం చెప్పడంతోనే తాము పార్లమెంట్‌లో నిరసన తెలుపాల్సి వచ్చిందని టీ ఎంపీలు సోనియా దృష్టికి తీసుకువచ్చారు. మరి ఈ లేఖ పై అమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm first collectors meet
Sarath babu wife seeks divorce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles