Decission on t will take time

Decission on T. will take time.GIF

Posted: 12/09/2011 10:21 AM IST
Decission on t will take time

d.srinivasరాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి,  కేంద్రానికి మింగుడు పడకుండా చేస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వాదులు కేంద్రం పై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పై కేంద్రం కమిటీలు వేసి, అభిప్రాయాల సేకరణలు కూడా తీసుకుంది. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో చావు కబురు చెప్పింది. దానికి తెలంగాణ తెచ్చేది – ఇచ్చేది – చచ్చేది మేమే అంటూ ఇన్ని రోజులు గడిపిన కాంగ్రెస్ నాయకులలో ఒకరు అయిన డి. శ్రీనివాస్ కేంద్రం చెప్పినదానికి తలూపి తెలంగాణ ప్రజల ఆశల పై నీళ్ళు చల్లారు. తెలంగాణ అంశం ఇప్పటికిప్పుడు తేలదని ఆయన కచ్చితంగా చెప్పేశారు. తెలంగాణపై ఇప్పటికిప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోబోదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు ఆలోచన కేంద్రం వద్ద లేదని ఆయన అన్నారు.

ఈనెల 22న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత తెలంగాణ పై ప్రాంతీయ మండలి వేసే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయం పై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. బోడోలాండ్, గూర్ఖాలాండ్ లకు ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ మండలిని తెలంగాణ ఏర్పాటు చేస్తారని.. దానికి ప్రకటించినట్లుగానే ప్రత్యేక ప్యాకేజీనే ఏర్పాటు చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ మండలికి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా డి.శ్రీనివాస్ ను నియమిస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం.
అప్పుడు, ఇప్పుడు అంటూ 204 ఎన్నికల వరకు కూడా లాగాలనేది కాంగ్రెసు పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే సోనియా బర్త్ డే రోజు ఈ అంశం పై డీఎస్ మాట్లాడం ఆమె బర్త్ డే రోజు తెలంగాణ వాదులకు చావు చెప్పారని అంటున్నారు. మరి దీని పై తెలంగాణ వాదులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian railway running in losses
Telangana self respect day observed today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles