చిల్లర వ్యాపారం చిల్లర పనేమీ కాదు. వినియోగదారుడితో ప్రత్యక్ష సంబంధముండేది చిల్లర వ్యాపారులకే. టోకు వ్యాపారులు ఏ కాస్త లాభమున్నా సరే టోకున అమ్మేస్తుంటారు. వారికి టర్నోవరే ప్రధానం. కానీ చిల్లర వ్యాపారులు, వినియోగదారులు ప్రతి రోజూ ముఖముఖాలు చూసుకునేవారు. వినియోగదారుల అవసరాలు, వారి ఇష్టాయిష్టాలు పరిశీలిస్తూ తదనుగుణంగా టోకున కొనుగోలు చేసి ఎక్కువ లాభాలకు అమ్ముతుంటారు. టోకు వ్యాపారులు ఎంత సేపూ సరుకుని క్లియర్ చేసుకోవటానికే ఇష్టపడతారు. చిల్లర వ్యాపారులు సరుకు నిలవ చేస్తూ అదను కొద్దీ ధరల సర్దుబాట్లు చేసుకుంటూ అమ్మకాలు చేస్తారు. అందువలన ధరల పెరుగుదలలో సరుకు నిల్వ చేసేవారు, చిల్లరగా అమ్మేవారి ప్రమేయమే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిల్లర వ్యాపారం చేసుకునే వారు చిన్నా పెద్దా స్థాయిల్లో అన్ని చోట్లా సందు సందులో కనిపిస్తారు.
చిల్లర వ్యాపారంలో కేవలం కిరాణా సరుకులే కాదు కాయగూరలు, పండ్లు, కోడిగుడ్లు, మాంసం, చేపలు కూడా వస్తాయి. ధాన్యం, పప్పు ధినసులను నిలవ చేసుకోవటం సులభమే కానీ పండ్లు, కాయగూరలు, గుడ్లు, చేపలు లాంటివి ఎక్కువ కాలం నిలవ పెట్టుకోగలిగే ఏర్పాట్లు లేనప్పుడు, సగానికి సగం పాడైపోతాయనే లెక్కతోనే వాటి ధరలను నిర్ణయించటం జరుగుతుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లి లాంటివైతే నిలవున్న కొద్దీ ఎండిపోవటం వలన వాటి బరువు తగ్గిపోవటంతో వాటి తూకపు ధరను పెంచాల్సి వస్తుంది.
ఉత్పాదకుల దగ్గర్నుంచి వినియోగదారుల దగ్గరకు చేరుకోవటానికందుకే మధ్యలో మారిన చేతుల సంఖ్యను బట్టి వాటి ధర పెరిగిపోతూవుంటుంది. అందువలన ధరలను అదుపు చేయాలంటే మధ్యవర్తుల ప్రమేయం తగ్గించి, ఆహార పదార్థాలను నిల్వ చేసే ఏర్పాట్లను పెంచుకుంటే అది సాధ్యమౌతుంది. ఇప్పటికే రిలయన్సలాంటి వారు చిల్లర వ్యాపారంలోకి దిగారు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటిని శుభ్రం చేసి నిల్వ చేస్తూ వినియోగ దారులకు అమ్మే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వెలిసి నగరాల్లో వినియోగదారులకు కాస్త తక్కువ ధరకే విక్రయిస్తున్నా ఇప్పటికీ ధరలు మండిపోతూనేవున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం విదేశ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. విదేశీ సంస్థలను చిల్లర వ్యాపారంలో 51 శాతం వరకూ పెట్టుబడులకు అనుమతించింది. అయితే దీనిమీద దేశమంతా వ్యతిరేకత వస్తోంది. వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలే కాకుండా యుపిఏ మిత్ర పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డిఎమ్ కే లు కూడా వ్యతిరేకంగా గళాలెత్తటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆరు రోజులుగా పార్లమెంటు సమావేశాలు జరగకుండా గందరగోళం చెలరేగుతున్న విషయాల్లో ఈ చిల్లర వ్యాపారంలో విదేశ పెట్టుబడులు ఒకటి.
ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ రాజకీయ ప్రముఖులందరికీ ఎఫ్ డి ఐ (ఫారిన్ డైరెక్ట ఇన్వెస్ట్ మెంట్) మీద వివరణ నిస్తూ లేఖలు రాసారు. దాని సారాంశం,
"మన దగ్గర శీతల, నిల్వ రవాణా ఏర్పాట్లు తగినంతగా లేనందువలన, పంట దిగుమతి తర్వాత ఖర్చులు చాలా అధికంగా సమ్మతించలేనంతగా ఉన్నాయి. మధ్యవర్తుల ప్రమేయం వలన ఆహార పదార్ధాల సరఫరా లోనూ ధరలోనూ ప్రభావం పడుతోంది. దీనితో ఒక పక్క పండించే రైతులు వారి ఉత్పాదనలకు సరైన ప్రతిఫలాన్ని అందుకోలేకపోతున్నారు, మరోపక్క వినియోగదారులు రైతులకు పడ్డ ధరకు 5 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు."
ఎఫ్డిఐతో పాటు గా చిన్న పరిశ్రమల 30 శాతం వాటాను కూడా తప్పనిసరి చేసామని కూడా చెప్తూ, ఈ లేఖను సుష్మా స్వరాజ్ లాంటి అగ్రనేతలకు పంపించామని ఆనంద్ శర్మ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోసం మరికొంత వివరణనిస్తూ, భారత దేశంలో రాష్టాలకున్న స్వేచ్ఛ దృష్ట్యా, ఈ ఎఫ్డిఐ చట్రంలో రాష్ట్ర స్థాయిలో వీటిని అమలుపరచుకోవచ్చని రాసారు.
అన్ని పార్టీలూ నిరసన గళమెత్తుతూ ఈ ఎఫ్ డి ఐ ని ఉపసంహరించుకుని లోక్ సభలో చర్చకి ప్రవేశ పెట్టమని, దీనిమీద ఓటింగ్ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. దానితో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడ్డట్టయింది. ఐదు కోట్ల చిల్లర వ్యాపారులు తన రాష్ట్రంలో ఉన్నారని, వారి సంరక్షణ తన బాధ్యతని మమతా బెనర్జీ అన్నారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని, దీనివలన చిన్న వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు నష్టపోవటమే కాకుండా, మనదేశ ఆర్థిక స్తితిగతులు మారిపోతాయని, పతనం కావటం ఖాయమని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు.
భాజపా, జనతా దళ్ లాంటి ప్రతిపక్షాల నుంచే కాకుండా, మిత్ర పక్షాలైన డిఎమ్కే, తృణమూల్ కాంగ్రెస్ నుంచే కాకుండా, తమ సొంత పార్టీ నుంచి కేరళ నుంచి మరితర ప్రాంతాల నుంచి ఎఫ్ డి ఐ మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
మిగతా అంశాలన్నీ పక్కకు పెట్టి ఎఫ్ డి ఐ మీద ముందుగా చర్చలు జరపాలని అందరూ పట్టుబడుతుండగా నెమ్మదిగా మెత్తబడుతూ ప్రభుత్వం చర్చలకు ఆమోదించినా, ఓటింగ్ కి ఇంకా సుముఖంగా లేదు. ప్రభుత్వం ప్రతిపాదించదలచుకున్న ఇతర అంశాలను ముందుకు తేవటానికి మార్గాంతరాల కోసం వెతుకుతోంది.
ప్రత్యేక తెలంగాణా ఆందోళన ఎలాగూ ఉంది, లోక్ పాల్ బిల్లు కూడా ప్రవేశపెట్టవలసివుంది. అయితే వాటిని ప్రవేశపెట్టలేకపోవటానికి ప్రతిపక్షాలు సభ జరగకుండా అడ్డు కోవటమే నని నెపాన్నంతా ప్రభుత్వం ప్రతిపక్షాల మీద తోయగలదు జాగ్రత్తని కిరణ్ బేడి హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీద ఈ రోజు ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. ఎఫ్ డి ఐ ని రద్దు చేస్తేనే తర్వాత ముచ్చటని కాంగ్రేసేతర పార్టీలన్నీ కచ్చితంగా చెప్పేసారు.
ధరలను తగ్గించి, రైతులను ఆదుకోవటానికి సిద్ధాంతపరంగా ప్రభుత్వం చేసిన ఆలోచన మంచిదే కానీ ఆర్థిక పగ్గాలను విదేశీ సంస్థలకివ్వటమే మన నాయకులకెవరికీ సమ్మతంగా లేదు. రాజకీయ నాయకుల ప్రతి మాటను, చర్యనూ తప్పు పట్టగూడదు నిజాయితీగా కూడా వ్యతిరేకతను చూపిస్తుండవచ్చు కానీ, ఇంత పెద్ద నిర్ణయంలో ఎవరినీ భాగస్వామ్యులను చెయ్యకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందువలన వచ్చిన ఆగ్రహమే కాకుండా, ఈ వ్యవహారంలో ఎవరికీ ముడుపులు ఏమీ ముట్టకపోవటం కూడా బాధాకరమైన విషయమే. విదేశీ సంస్థలతో మనవాళ్ళు ఏ బేరం కుదుర్చుకోగలరు అంటూ కొందరు రాజకీయ విమర్శకులు విమర్శిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more