విశాఖ నగరంలోని పూర్వశికూడలి సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ రోజు నుండి ఎంసెట్ కౌన్సెలింగ్ కుఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రిన్సిపల్స్ కె.సంద్యారాణి, బి.దేముడు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో 1 నుంచి 7500 ర్యాంకు వరకు పాలిటెక్నిక్ కళాశాల, 7501 ను నుంచి 15 వేల ర్యాంకు వరకు కెమికల్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుంది. అభ్యర్థులు ర్యాంకు కార్డు, ఇంటర్ హాల్ టికెట్, మార్కుల జాబితా, ఆధాయ, కుల ద్రువీకరణ పత్రాలు ఒరిజినల్ , నకళ్లతో హాజరుకావాలి. ఈ రెండు కళాశాలలతో పాటు నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలోను జరిగే కౌన్సెలింగ్ ఈనెల 30తో ముగియనుంది. సెప్టెంబర్ 2,3 తేదీలతో ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుంది. 5వ తేదీ సాయంత్రం అడ్మిషన్ల వివరాలు వెల్లడిస్తారు.
బహిష్కరిస్తాం
ఈరోజు నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్ లైన్ కేంద్రాల్లో విధులు బహిష్కరిస్తామని పాలిటెక్నిక్ అధ్యాపకులు సంఘం(పాల) అధ్యక్షులు ఎన్. చంద్రశేకర్ తెలిపారు. క్లాస్-4 సిబ్బందితో సహా అద్యాపకులంతా సమ్మెలో ఉంటున్నందున కౌన్సెలింగ్ కు అంతరాయం ఏర్పాడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నాయకుడు స్నానం
సమైక్యాంద్రకు మద్దతుగా విశాఖలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిన్న నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన ఆయన, ఈ ఉదయం రోడ్డుపైన, స్నానం చేసి నిరసన తెలిపారు.
దీక్షలు
సబ్బవరం మండలంలో సమైక్యాంద్రకు మద్దతుగా వైకాపా నేత గండి బాబ్జీ ఆద్వర్యంలో 10 మంది వైకాపా కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.
200 మంది చేరిక
సబ్బవరం మండలం బాటజంగాల పాలెం శివారు అజయ్ నగర్ కాలనీకి చెందిన వైకాపా కార్యకర్తలు 200 మంది రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షడు బండారు సత్యనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు చేపడితే చూస్తూ ఉరుకోమని చెప్పారు. కార్యకర్తలకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా తెదేపాలో చేరిన కార్యకర్తలకు కండువాలు వేశారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more