after a long time the star music director devi sri prasad has talk about his film offers as hero in south film industry | devi sri prasad movies

Star music director devi sri prasad talks about his film offers as hero

devi sri prasad news, devi sri prasad hero offers, devi sri prasad controversies, devi sri prasad movies, devi sri prasad love affairs, devi sri prasad movie hero offers, devi sri prasad interview, devi sri prasad stills, devi sri prasad photos

star music director devisri prasad talks about his film offers as hero : after a long time the star music director devi sri prasad has talk about his film offers as hero in south film industry.

‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

Posted: 11/24/2015 12:57 PM IST
Star music director devi sri prasad talks about his film offers as hero

దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఈ విధంగా వెండితెర ఆరంగేట్రంపై వస్తున్న వార్తల విషయాన్ని దేవిశ్రీ దగ్గర ప్రస్తావించగా.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తనదైన శైలిలో స్పందించాడు. తనకు హీరోగా ఎన్నో అవకాశాలు వచ్చినా.. ఆయా స్టోరీలకు తాను సెట్ కానని ఆయా దర్శకనిర్మాతలకు చెప్పానని, అప్పుడు వేరే హీరోలతో ఆ సినిమాలు చేయాల్సిందిగా సూచించానని ఆయన స్పందించాడు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన విషయాన్ని దేవీశ్రీ పంచుకున్నాడు.

నాగచైతన్య - తమన్నా జంటగా వచ్చిన ‘100%లవ్’ మూవీలో నిజానికి తాను హీరోగా చేయాల్సి ఉందన్నాడు దేవీశ్రీప్రసాద్. అయితే, ఈ అవకాశాన్ని తానే వదులుకున్నానని చెప్పాడు. 100%లవ్ సినిమాలో తనను హీరోగా చేయమని డైరెక్టర్ సుకుమార్ కోరారని, ఈ కథకు తాను యాప్ట్ కాదనే తిరస్కరించినట్లు దేవి స్వయంగా తెలిపాడు. ఇలా తనను హీరోగా చేయమని చాలా అవకాశాలు వచ్చాయని, వాటిని తానే రిజక్ట్ చేసి, వేరే హీరోలతో చేయాల్సిందిగా సూచించానని చెప్పాడు. అలా.. తాను వదులుకున్న సినిమాల్లో కొన్ని ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయని తెలిపాడు. ఇప్పటికీ హీరోగా నటించాలని తెలుగు, తమిళ భాషల్లో పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయన్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అల్లు అరవింద్, జ్ఞానవేళ్ రాజాతోపాటు మరికొందరు ప్రొడ్యూసర్స్ సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సిందిగా కోరుతున్నారని చెప్పాడు. అయితే.. తన మనసుకు నచ్చిన కథలు భవిష్యత్తులో దొరకితే తప్పకుండా హీరోగా చేస్తానని తన కోరిక బయటపెట్టాడు దేవీశ్రీ.

ప్రస్తుతం తన దృష్టి సంగీతం పైనే వుందని చెప్పిన దేవి.. ఈ రంగంలో తాను సంపాదించిన క్రేజ్ ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి సారించానని స్పష్టం చేశాడు. మరి.. దేవి కోరుకున్న కథ ఎప్పుడు దొరుకుతుందో.. ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో.. ఇంతకీ హీరోగా చేస్తాడా లేదా..? అనే విషయాలు సస్పెన్స్ గానే మిగిలిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devi sri prasad  tollywood  kollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

  • Thala ajith helps producer mm ratnam by doing movies on his productions

    తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ‘హీరో’నే!

    Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more