Rohit Sharma reveals opening partner in IPL 2022 ముంబై ఇండియన్స్ శాశ్వత ఓపెనర్ ఇతనే: రోహిత్ శర్మ

Ipl 2022 mumbai indians skipper rohit sharma reveals opening partner

Rohit Sharma, Mumbai Indians, Mahela Jayawardene, Ishan Kishan, IPL, IPL 2022, IPL news, IPL updates, IPL 15, Mumbai Indians opener, IPL 22, IPL 2022, Ishan Kishan opener, Mumbai, Mumbai Indians, National Cricket Academy, Rohit Sharma MI Captain, Suryakumar Yadav, cricket, IPL, sports

Mumbai Indians skipper Rohit Sharma revealed on who will come out to bat alongside him in this year's IPL. "I will open the batting. I have been doing that in the past so I'm looking forward to open with Ishan Kishan," said Rohit during a virtual press conference.

ముంబై ఇండియన్స్ శాశ్వత ఓపెనర్ ఇతనే: రోహిత్ శర్మ

Posted: 03/24/2022 08:12 PM IST
Ipl 2022 mumbai indians skipper rohit sharma reveals opening partner

ఇండియన్ ప్రిమియర్ లీగ్ అనగానే అభిమానుల ఫేవరేట్ జట్లుగా ముందుడేవి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్టు తుది వరకు పోరాడి జట్టును అగ్రస్థానంలో నిలపడంతో పాటు యావత్ క్రికెట్ అభిమానులకు హాట్ ఫేవరెట్ జట్లుగా ఉంచుతున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించి ముంబై ఇండియన్స్ ను అంతెత్తులో నిలబెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తాజా ఐపీఎల్ వేలంలో చాలా మంది పాత ప్లేయర్లను ఆ జట్టు వదిలేయాల్సి వచ్చింది. అందులో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఒకడు.

అయితే, ఇప్పుడు జరగబోయే ఐపీఎల్ లో రోహిత్ ఎవరితో కలిసి ఓపెనింగ్ చేస్తాడన్న ఆసక్తికర ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే దానికి అతడు జవాబిచ్చాడు. ఖచ్చితంగా తన ఓపెనింగ్ స్థానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశాడు. గతం నుంచే తాను ఓపెనింగ్ చేస్తున్నానని, ఇప్పుడు కూడా అందులో మార్పు ఉండదని తేల్చి చెప్పాడు. ఇకపై ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని రోహిత్ తెలిపాడు. ఇక టైమల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్ లు జట్టుకే కొత్తగానీ.. ఆటకు కాదని పేర్కొన్నాడు.

చాలా ఏళ్లుగా ఆడుతున్నారని, ఏం చేయాలో వారికి బాగా తెలుసని చెప్పాడు. జట్టుగా వాళ్లు ఏం చేయగలరో, ఏం చేయాలో చెప్పాల్సిన బాధ్యత కూడా తమపై ఉంటుందని చెప్పాడు. గతంలో ఇద్దరూ వేరే ఫ్రాంచైజీలకు ఆడారని, ఇప్పుడు తమకు తగ్గట్టుగా వారిని మలచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ వివరించాడు. కాగా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ చాలా బాగుంటుందని ముంబై హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. వికెట్ కీపర్ అయిన ఆటగాళ్లకు టాప్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశం రావడం చాలా అరుదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles