‘It’s a very weak statement’: Kapil Dev కోహ్లీ ఇంత నిరాశగా మాట్లాడతాడని అనుకోలేదు: కపిల్

Kapil dev says kohli s not brave enough statement is weak

world cup t20 2021, world cup 2021, virat kohli, t20 world cup match 2021, t20 world cup 2021, ravi shastri, mahendra singh dhoni, kapil dev, icc t20 world cup 2021, icc men's t20 world cup, Team India, New Zealand, Pakistan, T20 World Cup, Sports, Cricket

The legendary Kapil Dev feels Virat Kohli's admission of his team not being brave enough in the T20 World Cup loss to New Zealand is a "very weak statement" and head coach Ravi Shastri along with mentor Mahendra Singh Dhoni should step up to lift the players' morale.

విరాట్ కోహ్లీ ఇంత నిరాశగా మాట్లాడతాడని అనుకోలేదు: కపిల్

Posted: 11/01/2021 08:08 PM IST
Kapil dev says kohli s not brave enough statement is weak

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటములను మూటగట్టుకుంటోంది. పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఒత్తిడి కారణంగా ఓటమి పాలైందని అబిమానులతో పాటు క్రిడాభిమానులు భావించారు. కానీ.. విరాట్ సేను తెగించి ఆటడం లేదన్న విషయం న్యూజీలాండ్ జట్టుతోనూ ఓటమిని చవిచూడటంతో స్పష్టమైంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ సహా ఫీల్డిండ్ విభాగంలోనూ రాణించలేక భారత క్రికెట్ జట్టు పూర్తిగా చతికిల పడింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, ప్రపంచ రేటింగ్ కలిగిన బౌలర్లు ఉండి కూడా టీమిండియా ఆకట్టుకునే స్థాయిలో ప్రదర్శనను ఇవ్వలేకపోతోంది.

న్యూజిలాండ్ తో ఘోర పరాభవం అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో తమను పిరికితనం ఆవహించిందని తెలిపాడు. ధైర్యంగా షాట్లు కొట్టేందుకు, తెగించి బౌలింగ్ వేసేందుకు తాము వెనుకంజ వేశామని అన్నాడు. మొత్తమ్మీద ఈ మ్యాచ్ లో ఏమంత ఆత్మవిశ్వాసంతో ఆడలేదని వెల్లడించాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ ఇంత బేలగా మాట్లాడతాడని అనుకోలేదని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ స్థాయి ఆటగాడికి ఇది తగదని అన్నారు.

మ్యాచ్ లు గెలిచేందుకు కోహ్లీ ఎంత కసితో ఉంటాడో అందరికీ తెలిసిందేనని, కానీ ఈ జట్టును, కోహ్లీ ఆలోచనా విధానాన్ని చూస్తుంటే ఏమాత్రం స్థాయికి తగ్గట్టుగా లేని విషయం వెల్లడవుతోందని కపిల్ దేవ్ విమర్శించారు. డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల దృక్పథాన్ని ఒక్కసారిగా మార్చడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నడుమ జట్టులో స్ఫూర్తి రగిలించేందుకు హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనీ తమ అనుభవాన్ని ఉపయోగించాలని కపిల్ సలహా ఇచ్చారు. వరుస ఓటముల పాలవుతున్న జట్టుపై విమర్శలు రావడం సహజమేనని, ఆటగాళ్లు అందుకు సంసిద్ధులుగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapil Dev  Virat Kohli  Team India  New Zealand  Pakistan  T20 World Cup  Sports  Cricket  

Other Articles