Sunil gavaskar appointment questions shivlal yadav promotion

Sunil Gavaskar, Shivlal Yadav, bcci, ipl, Sunil Gavaskar appointment,

Sunil Gavaskar appointment questions Shivlal Yadav promotion

ఈ ఇద్దరే బీసీసీఐ అధ్యక్షులు

Posted: 03/29/2014 01:38 PM IST
Sunil gavaskar appointment questions shivlal yadav promotion

ఐపీఎల్‌కు సంబంధించినంత వరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్  గవాస్కర్ వ్యవహరిస్తారు. మిగిలిన బోర్డు వ్యవహారాలతో సంబంధం లేదు. బీసీసీఐ కామెంటేటర్‌గా ఉన్న కాంట్రాక్టును వదిలేసుకోవాలి. ఇందుకుగాను పరిహారం పొందొచ్చు. 

రకరకాల మలుపులు తిరిగిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు వ్యవహారంలో చివరకు అందరికీ సంతోషకరమైన ఆదేశాలే వచ్చాయి. కేసును విచారిస్తున్న ద్విసభ్య సుప్రీం కోర్టు బెంచ్ ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీఫుల్లా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎవరేం చేయాలంటే.. 

అంటే బోర్డు చరిత్రలో తొలిసారి ‘పెయిడ్ అధ్యక్షుడు’గా గవాస్కర్ వ్యవహరించబోతున్నారు. అయితే ఐపీఎల్‌ను నడపడానికి గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. లీగ్ సీఈఓ సుందర్ రామన్‌ను కొనసాగించాలా లేదా అనే విషయంలో గవాస్కర్ నిర్ణయం తీసుకోవచ్చు. తను కావాలంటే కొత్తగా ఎవరినైనా లీగ్ నిర్వహణ కోసం నియమించుకోవచ్చు.

 శివలాల్ యాదవ్: ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికి సంబంధించి శివలాల్ యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కేసు విచారణ ముగిసే వరకు లేదా తర్వాతి ఏజీఎమ్ వరకు బోర్డు పూర్తి పరిపాలనా బాధ్యత శివలాల్‌దే.శ్రీనివాసన్: ఈ కేసు విచారణ ముగిసే వరకు అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడతారు. విచారణ ముగిశాక తిరిగి బోర్డు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవచ్చు. 

ఐపీఎల్: లీగ్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు ఆడతాయి. రాజస్థాన్, చెన్నై జట్లు కూడా పాల్గొంటాయి. ‘క్రికెట్ అభిమానుల కోసం ఈ రెండు జట్లను అనుమతిస్తున్నాం’ అని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాబట్టి ఎప్పటిలాగే ఏప్రిల్ 16న యూఏఈలో ఐపీఎల్ ప్రారంభమవుతుంది.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles