రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన ఈ స్టార్ గురించి బాలీవుడ్ మీడియాలో కూడా పలు ఆసక్తికరమైన కథనాలు ప్రచురితమవుతున్నాయి. అమెరికాలో సెటిలైన ఓ తెలుగు వ్యాపారవేత్త కూతురును ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
దీంతో పాటుగా మరోవైపు హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ను జోడించి బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అనుష్క తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ ఇద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని డార్లింగ్ ఎన్నిసార్లు చెబుతున్నా.. నెట్టింట్లో రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరిద్దరి మీద వచ్చిన మరో గాసిప్ వైరల్‌గా మారింది.అనుష్కతో ప్రభాస్ లవ్ ఎఫైర్ నడుస్తోందని.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఇంటి కోసం వెతుకుతున్నారని కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌లోని సీక్రెట్ స్పాట్లో ఇద్దరూ రహస్యంగా కలుస్తున్నారని.. ‘సాహో’ స్పెషల్ స్క్రీనింగ్‌కు కూడా ఆమెను తీసుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడితో అగని గుసగుసలు మరింత ముందుకెళ్లాయి. దేశవ్యాప్తంగా వీరికి అభిమానులు వున్న క్రమంలో ఇక తాజాగా వీరు విదేశాల్లో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు బాలీవుడ్ మ్యాగజీన్లలో గుప్పమంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more
Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more