This family is more diverse than the victors Family విజయాలు వరించే వారి కన్నా ఈ కుటుంబం మరింత భిన్నమైనది

This family is more diverse than the victors family

Keeravani Family, SS Rajamouli Family, Tollywood Actors, Celebrities

This family is more diverse than the victors Family

విజయాలు వరించే వారి కన్నా ఈ కుటుంబం మరింత భిన్నమైనది

Posted: 12/26/2019 06:31 PM IST
This family is more diverse than the victors family

కీరవాణి... రాజమౌళి.. ఈ  ఇరువురి పేర్లు తెలియదు, వినలేదు అనే  ప్రస్తవాన్నే రాదు  మన  తెలుగు చిత్ర సీమ  ప్రజలకు. ఇటు చిన్న నుండి అటు పెద్దల వరకు అందరి కి ఎంతగానో సుపరిచి తులు  వీళ్ళు. తన దర్శక చతురతతో రాజమౌళి గారు మన తెలుగుచిత్ర సీమ యొక్క  ప్రతిభ పాటవాలను ఎతైనా శిఖర అంచులను తాకేలా  భాషలను ,దేశ ఖండాలను దాటి తీసుకు వెళ్లారు. సంగీతంతో  రాళ్లు  కూడా  కరుగుతాయి అనే ఆలోచనను ఈ కీరవాణి రాగాలు నిజం చేయగలవు. తన అమితమైన మధురా సంగీత సుస్వరాలతో మన చిరు హృదయాలను గెలుచుకున్నారు.

కీరవాణి తండ్రి శివశక్తి దత్తా. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గార్ల వారసత్వ చిహ్నాలే ఈ ఇరువురు. వీరి కుటుంబం ఇప్పుడు టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ కుటుంబంలోని వారంతా  ప్రతిభావంతులే. వారి వారి  స్వతః ప్రతిభను నమ్ముకొని మన చిత్రసీమలో తమ సత్తా చూపుతున్నారు. అంతేకాక ఈ ఇరు కుటుంబాలకు మంచి సన్నిహిత్యం ఉంది. అంతేకాక వీరు  ఏంతగానో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తమ కష్ఠాల  వారధి గురించి విజయేంద్ర వర్మ గారు పలు ఇంటర్వూస్ లలో తెలిపారు. కీరవాణి గారు సంగీత దర్శకుడిగా నిలదొక్కుకున్నాక ఈ కుటుంబం రాత మారింది. ఇక రాజమౌళి ఆగమనంతో ఆ కుటుంబం స్థాయే మారిపోయింది.

రాజమౌళి గారి సినిమాలలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. అది మనల్ని అటు వైపు అమాంతం లాగుతుంది. ఒక స్టార్ దర్శకుడిగా  ఆనతి కాలం లోనే మన రాజమౌళి గారు మారిపోయారు. తన రెండో సినిమాకే స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ఆయన సతీమణి రమ రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, కీరవాణి భార్య శ్రీవల్లి లైన్ ప్రొడ్యూసర్‌గా వాళ్ల సినిమాల మేకింగ్‌లో ముఖ్య భూమిక వ్యవహరించారు. తర్వాత రాజమౌళి, రమల తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ కూడా ప్రొడక్షన్ వ్యవహారాల్లో తన ప్రతిభను కనబరిచారు. అతను నిర్మాతగా తన అదృష్ఠంని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటె కీరవాణి  గారి సోదరుడు ఎస్.ఎస్.కాంచి రచయితగా, నటుడిగా ప్రతిభ చూపించాడు. దర్శకుడిగా కూడా మారి ‘షో టైం’ అనే వెరైటీ సినిమా తీశాడు.

కీరవాణి సోదరుడు, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ప్రతిభ ఎలాంటిదో తెలిసిందే. ఎం.ఎం.శ్రీలేఖ సైతం ఒకప్పుడు సంగీత దర్శకురాలిగా తన ప్రతిభను బాగానే చాటింది మం తెలుగు చిత్ర రంగం ఒక మహిళా సంగీత దర్శకరాలుగా  తన దైనా శైలిలో తన ప్రతిభ పాటవాలకు సంగీత రాగాలను జోడించి మన మన్ననలను పొందింది. ఇక కీరవాణి, రాజమౌళిలకు బంధువైన గుణ్ణం గంగరాజు దర్శకుడిగా 90ల్లోనే ‘లిటిల్ సోల్జర్స్’ లాంటి క్లాసిక్ అందించారు. నిర్మాతగా ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి ఆణిముత్యాలు అందించారు. ‘అమృతం’ గురించి చెప్పాల్సిన అవసరం అసలు లేదు. ఆ సీరియల్ ఎన్ని చానెల్స్ మారినా దాని చూసే ప్రేక్షకులు మాత్రం ఆ నాటి నుండి ఈ నాటి వరకు దాని పై మక్కువ మాత్రం  తగ్గించలేదు.

ఇప్పుడు ఆయన తనయుడు అశ్విన్ గంగరాజు ‘ఆకాశవాణి’ అనే విభిన్నమైన సినిమా తీస్తున్నాడు. ఇక కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఇప్పటికే గాయకుడిగా సత్తా చాటుకుని ఇప్పుడు ‘మత్తువదలరా’ సినిమాతో సంగీత దర్శకుడిగా మం ముందుకు రానున్నారు. ఈ చిత్రంతోనే హీరోగా పరిచయమైన శ్రీ సింహా కూడా తన అదృష్ట రేఖ్లను పరీక్షించుకుంటున్నారు. టాలీవుడ్ లో  వారాసత్వా తరంగాలు చాలానే ఉన్నాయి. విజయాలు వరించే వారి కన్నా ఈ కుటుంబం  మరింత  భిన్నమైనది. ఈ కుటుంబం లోని ప్రతి ఒక్కరు ప్రతిభ వంతులే. ఎవరి గురించి మొదలు పెట్టాలో  అని అయోమయ అన్వేషణలో పడి  పోతాము. అంతా టాలెంట్ ఉన్న కుటుంబం మాత్రం మరొకటి లేదంటే అతిశయోక్తి అనేది అసత్యం కానే కాదు.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keeravani  SS Rajamouli  Tollywood Heros  

Other Articles