Allu Arjun Comes for Priya Varrier అంతర్జాల సంచలన తార కోసం బన్ని..!

Allu arjun comes for wink girl priya prakash varrier

Oru Adaar Love, Allu Arjun, lovers day, audio launch, Priya Prakash Varrier, Roshan Abdul, Shaan Rahman, Omar Lulu, Mollywood, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Stylish Star Allu Arjun is trying to promote wink sensation Priya Prakash Varrier movie Oru Adaar Love’s Telugu version Lovers Day in Telugu.

కన్నుగీటిన ప్రియా కోసం అల్లు అర్జున్..!

Posted: 01/21/2019 09:04 PM IST
Allu arjun comes for wink girl priya prakash varrier

మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ వేడుకకు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ పోస్టర్‌ను విడుదల చేశాయి.

ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో కన్నుకొట్టిన సన్నివేశంతో ప్రియ దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీని తెచ్చుకున్నారు. ప్రియ కన్నుగీటిన తీరుకు బన్నీ కూడా ఫిదా అయిపోయారు. తాను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇదొకటి అంటూ అప్పట్లో ట్వీట్‌ చేశారు. అదీకాకుండా బన్నీకి ప్రియ వీరాభిమాని. అందుకే ప్రీ రిలీజ్‌ వేడుకకు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

‘ఒరు అడార్ లవ్’ చిత్రం గతేడాది జూన్‌లోనే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ‘మాణిక్య మలరయ’ పాటలో ముస్లింలను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా పలు సన్నివేశాలున్నాయని కొందరు చిత్రబృందంపై కేసు వేశారు. దాంతో పలుమార్లు వాయిదా పడుతూ ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oru Adaar Love  Allu Arjun  lovers day  audio launch  Priya Varrier  Roshan Abdul  Omar Lulu  Mollywood  

Other Articles