Lavanya Denies Rumour on Tamil Producers Penalty | 3 కోట్ల పెనాల్టీపై లావణ్య త్రిపాఠి రియాక్షన్

Lavanya tripathi on producers penalty issue

Lavanya Tripathi, Lavanya Tripathi Fine, Lavanya Tripathi Penalty, Lavanya Tripathi Rumours, Lavanya Tripathi Fake News, Lavanya Tripathi About Fake News

Lavanya Tripathi Denies rumour on Tamil Producers Council fined her. Earlier Kollywood Media published news that Lavanya slapped Rs.crore penalty by Chennai producers.

నిర్మాతల వ్యవహారంపై లావణ్య రియాక్షన్

Posted: 10/31/2017 04:03 PM IST
Lavanya tripathi on producers penalty issue

నటి లావణ్య త్రిపాఠి వరుసగా డిజాస్టర్లు పలకరిస్తుండటంతో ఆఖరిగా హాట్ అవతార్ లోకి మారిపోయి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేఘా ఆకాశ్ తప్పుకోవటంతో రామ్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న ఈ డెహ్రాడూన్ బ్యూటీ చివరకు ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న లావణ్యకు ఓ చిక్కు ఎదరైందంటూ కోలీవుడ్ మీడియా ఓ కథనం ప్రచురించాయి.

100% లవ్ చిత్రం తమిళంలో రీమేక్ లో ముందు లావణ్యను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు ముందు ఓకే చెప్పిన తర్వాత ఎందుకో ఆమె డ్రాప్ అయిపోయింది. దీంతో ఆ ఛాన్స్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండేకి దక్కింది. అయితే నిర్మాతలు మాత్రం లావణ్యను నిర్మాతల కౌన్సిల్ కు ఇడ్చార్ననది ఆ వార్త సారాంశం. రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు కోలీవుడ్ కౌన్సిల్ ను కోరినట్టు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో లావణ్య స్పందించింది. కోలీవుడ్ నిర్మాతల సంఘం తనపై రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ప్రకటించింది. అనివార్య కారణాల వల్లే తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని.. ఆ ప్రాజెక్టుపై నిర్మాతలు తనపై ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో కోలీవుడ్ మీడియా.. దాని ఆధారంగా కొన్ని మన మీడియా ఛానెళ్లు కూడా రాసిన ఆ వార్త ఫేక్ అని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles