Anjali to pair up with Bichagadu Hero Vijay Antony.

Bilingual actress for vijay antony

Telugu Actress, Anjali, Vijay Antony, Kaali Movie, Lead Heroine, Bilingual Movie

Anjali and Vijay Antony for the first time Vijay Antony's Kaali, directed by Kiruthiga Udhayanidhi, is a suspense drama.

విజయ్ ఆంటోనీ చిత్రంలో అంజలి

Posted: 09/07/2017 06:21 PM IST
Bilingual actress for vijay antony

బిచ్చగాడి తర్వాత వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చినా విజయ్ ఆంటోనీ ఇచ్చిన హ్యాంగోవర్ నుంచి తెలుగు ప్రేక్షకులు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అందుకే జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి వీలైనంత కాలం ఆ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేయించుకోవాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం చిరు టైటిల్ వాడుకుంటూ ఇంద్ర సేన చిత్రానికి నవంబర్ బరిలో దించబోతున్న విజయ్ తన తర్వాతి సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించేశాడు. 'కాళి' పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక కథ రిత్యా ఇందులో నలుగురు హీరోయిన్లు ఉంటారంటం. వీరిలో సునయన, అమృత, శిల్పా మంజునాథ్ లు కాగా, లీడ్ హీరోయిన్ గా మాత్రం అంజలి ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కృతికా ఉదయనిధి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇటీవల కాలంలో అంజలికి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. ఇక తమిళంలోను అవకాశాలు పల్చబడ్డాయి. చివరగా నటించిన చిత్రాంగద రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందకిి తెలీకుండా పోియంది. దాంతో ఈ రెండు భాషల్లోను విజయ్ సినిమా తన కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని భావిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles