Meizu Releases The 16s: 48MP and Snapdragon 855 అద్బుత ఫీచర్లలో అకర్షిస్తున్న ‘మీజు 16ఎస్’ స్మార్ట్ ఫోన్..!

Meizu s flagship 16s useth the bezel to hearken back to ye olden days

Meizu, Meizu 16s, Meizu 16s specifications, Meizu 16s features, Meizu 16s price, Meizu 16s availability, base 6GB RAM with 128GB storage variant india launch, variants, e-commerce, technology, business

Meizu recently announced the Meizu 16s, the company’s newest flagship smartphone. We were lucky enough to have the opportunity to go hands-on with this new device. While the Meizu 16s seems similar to its predecessor, the Meizu 16,

అద్బుత ఫీచర్లలో అకర్షిస్తున్న ‘మీజు 16ఎస్’ స్మార్ట్ ఫోన్..!

Posted: 04/24/2019 07:26 PM IST
Meizu s flagship 16s useth the bezel to hearken back to ye olden days

ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ మీజు తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు మీజు 16ఎస్. కంపెనీ నుంచి వస్తున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇది. లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ మీజు 16ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ అమర్చింది. అలాగే ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

దీంతో పాటుగా ఫోన్‌లో 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్ సెన్సర్, డ్యూయెల్ 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో 48 ఎంపీ+ 20 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ మూడు వేరియంట్ రూపంలో ఏప్రిల్ 28 నుంచి చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే భారతీయ విఫణీలోకి ఈ అద్బుత ఫీచర్లతో అకర్షిస్తున్న మీజు 16ఎస్ స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది.

చైనాలో స్మార్ ఫోన్ ప్రియులను మనన్నలు పొందిన ఈ ఫోన్.. ఇండియన్ మర్కెట్‌లోకి ఎలా స్పందన రాబడుతుందో వేచి చూడాల్సింది. ఇక ఈ ఫోన్లలో మొత్తంగా మూడు వేరియంట్లు అందుబాటులో వున్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీతో వచ్చింది మొదటి వేరియంట్. దీని ధర రూ.35,000. ఇక రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్+ 128 జీబీ మెమరీతో వచ్చింది. దీని ధర రూ.38,000. ఇక 8 జీబీ ర్యామ్+256 జీబీ మెమరీతో వచ్చిన మూడో వేరియంట్. దీని ధర రూ.43,000గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meizu 16s  Meizu 16s specifications  Meizu 16s features  Meizu 16s price  technology  business  

Other Articles