Mahindra hails this unique marriage hall which is also a truck విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

Anand mahindra hails this unique marriage hall which is also a truck watch video

mahindra, anand mahindra twitter ,movable marriage hall, movable banquet hall, innovation, creativity, anand mahindra news, anand mahindra viral news

Industrialist Anand Mahindra shared a very quirky video of an Indian truck which is also a banquet hall. Mahindra hailed the creativity of those who are behind this innovation. In a video, a giant truck, which is often used to transport vehicles, opens up into a hall-like structure. The truck turns into a portable hall of size 40x30 square feet. The video claimed that the wedding hall has a capacity of 200 people, including stylish furniture.

ఆనంద్ మహీంద్రా పంచుకున్న ‘మొబైల్ కళ్యాణమండపం’ రెడీ..

Posted: 09/26/2022 04:33 PM IST
Anand mahindra hails this unique marriage hall which is also a truck watch video

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారని తెలుసు. తన సంస్థకు చెందిన అప్ కమ్మింగ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఆయన తన ఖాతాలో వేసే ప్రతీ పోస్టు.. క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. పకృతి ఓడిలో అందమైన సరోవరం మొదలుకుని ఆంతకుముందు.. ఆ తరువాత అన్నీ ఎంతో క్రియేటివిటీతో కూడుకుని,. అశ్చర్యం గోలుపడంతో పాటు ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయన తన ఫాలోవర్స్ అడగరాని ప్రశ్నలు అడిగినా.. ఎంతో సహనంతో ఆయన సమాధానాలిస్తుంటారు.

అసాధారణ విషయాలు అయితే కానీ సర్వసాధారంగా పంచుకోని ఆయనకు కదిలించే మనస్సుతో పాటు స్పందించే మనస్సు కూడా ఉందని మనకు ఢిల్లీలోని చేతులు లేని వ్యక్తి ఘటనే నిదర్శనం. రెండు కాళ్లు, రెండు చేతులు లేవని ఓ మూల కూర్చోని.. ఇలాంటి వాళ్లు చేసేలా యాచించి బతకడం కన్నా.. ఓ వ్యక్తి తన మోపెడ్ నే అటోగా మార్చి సరుకులు రవాణా చేస్తున్న వీడియో ఆయనను కదిలించింది. అంతే ఆ వ్యక్తి తన సంస్థలో ఉద్యోగాన్ని కల్పించాడు. అలాంటి ఆనంద్ మహీంద్రా తాజాగా తన ఫాలోవర్స్ తో మరో వీడియోను పంచుకున్నారు. ఎంతో వినూత్నంగా అలోచించిన ఈ వీడియో విశేషాలెంటో చూద్దామా..

ఆ వీడియో ఓ కదిలే మ్యారేజి హాలు. దీని వివరాల్లోకెళితే... ఓ షిప్పింగ్ కంటైనర్ ను ఫంక్షన్ హాలుగా మలిచారు. ఈ కంటైనర్ పొడవు 40 అడుగులు కాగా, ఇందులో మడత వేసేందుకు వీలున్న కొన్ని భాగాలను తెరిస్తే మరో 30 అడుగుల వరకు విస్తరిస్తుంది. దీంట్లో 200 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దీని లోపల ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులకు చల్లదనాన్ని అందించేందుకు దీంట్లో రెండు ఏసీలు కూడా అమర్చారు. నగరాల్లోని కల్యాణ వేదికలను తలపించేలా ఇది రిచ్ లుక్ తో కనిపిస్తుంది. వర్షాకాలంలోనూ దీంట్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఫంక్షన్లు జరుపుకోవచ్చు.

దీన్ని ఎక్కడికైనా తరలించుకు వెళ్లవచ్చు. ఈ మొబైల్ ఫంక్షన్ హాలు వీడియోను చూసి ఆనంద్ మహీంద్రా ముగ్ధుడయ్యారు. ఇక దేవీశరన్నవరాత్రులు పురస్కరించుకుని ఆయన వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమితో మొదలయ్యే నవరాత్రి వేడుకలు దశమి (విజయదశమి)తో ముగుస్తాయి. ‘‘మా దుర్గ తొమ్మిది (నవ) విలువైన ఆశీర్వచనాలతో మిమ్మల్ని శక్తిమంతం చేయాలి’’ అని ఇమేజ్ లో సందేశం ఉంది. డిటర్మినేషన్ (పట్టుదల, సంకల్పం), సక్సెస్ (విజయం), డివోషన్ (భక్తి), ఫోకస్ (ఏకాగ్రత, దృష్టి), కాన్సిస్టెన్సీ (స్థిరత్వం, నిలకడ), పాజిటివిటీ (సానుకూలత), డిసిప్లేన్ (క్రమశిక్షణ), స్ట్రెంత్ (మనోబలం), హోప్ (ఆశ)ను అందిపుచ్చుకోవాలని ఆనంద్ మహీంద్రా అభిలషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles