SC denies blanket stay on demolition drives అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయలేం: సుప్రింకోర్టు

Supreme court refuses to pass interim direction staying demolitions across states

Supreme Court, SC on demolition drive, demolition drive, Jamiat-Ulema-I-Hind, Justice B R Gavai, Justice P S Narasimha, bulldozer demolition, uttar pradesh demolition, Prophet violent protests, india demolition, madhya pradesh demolition, india news, india latest news

Asking How it could pass “an omnibus order” restraining authorities from demolishing unauthorised constructions, the Supreme Court declined to pass an interim direction in this regard. The bench of Justices B R Gavai and P S Narasimha was hearing petitions filed by the Jamiat Ulama-i-Hind, which alleged illegal demolition of private properties in Uttar Pradesh following violent protests over remarks on the Prophet.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయలేం: సుప్రింకోర్టు

Posted: 07/13/2022 08:01 PM IST
Supreme court refuses to pass interim direction staying demolitions across states

అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ఇటీవల ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని యూపీ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇదే ప్రక్రియను అనుసరిస్తోన్న మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల స్పందనను తెలియజేయాలని నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను యోగీ ప్రభుత్వం చేపట్టింది. వీటిని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతోందంటూ పిటిషనర్‌ తరపున న్యాయవాదులు దుష్యంత్‌ దవే, సీయూ సింగ్‌లు వాదించారు. మతపరమైన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని.. మన సమాజానికీ మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతివాదుల తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేలు.. అలాంటిదేమీ లేదని, ముఖ్యంగా అల్లర్లకు-కూల్చివేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధారణంగా జరిగే ప్రక్రియేనని, చట్టప్రకారమే వీటిని కొనసాగిస్తున్నామని యూపీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై రాష్ట్రాలకు మధ్యంతర స్టేను ఇచ్చేందుకు నిరాకరించింది.

అయితే, జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 10న మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇదిలాఉంటే, నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారితీశాయి. వాటిపై చర్యలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వాలు.. హింసాత్మకఘటనలో నిందితులుగా ఉన్నవారి నివాసాలను కూల్చివేసే ప్రక్రియ చేపట్టింది. ఆ సందర్భంగా కీలకవ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ ప్రక్రియ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని.. అవి చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని వ్యాఖ్యానించింది. కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles