Supreme Court awards 4-month jail to Vijay Mallya in contempt case అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..!

Supreme court sentences fugitive vijay mallya to 4 month imprisonment for contempt of court

vijay mallya contempt of court, Vijay Mallya Verdict, Vijay Mallya news, vijay mallya properties, Vijay Mallya, Supreme Court, Mallya, State Bank of India, Vijay Mallya sc verdict, Vijay Mallya gets 4-month jail, Contempt case, vijay mallya net worth, vijay mallya latest news

The Supreme Court on July 11 sentenced fugitive businessman Vijay Mallya to four months' imprisonment and ₹2,000 fine almost five years after he was found guilty of contempt of court. The court directed the Home Ministry to "secure the presence of the contemnor to undergo the imprisonment imposed upon him". Mallya is believed to be in the United Kingdom.

అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..!

Posted: 07/11/2022 03:31 PM IST
Supreme court sentences fugitive vijay mallya to 4 month imprisonment for contempt of court

దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలగా తీసుకుని.. ఉద్దేశపూర్వకంగా వాటిని తిరిగి చెల్లించకుండా ప్రజాధనంతో దేశం వదలి పారిపోయిన.. ఆర్థిక నేరస్తుడు.. మాజీ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. దేశప్రజల సోమ్మును బ్యాంకుల నుంచి రుణం పేరుతో లూటా చేసి పారిపోయిన మాల్యాకు అత్యున్నత న్యాయస్థానం శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ అయ్యింది. కాగా, మాల్యా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. 2016 నుంచి మాల్యా లండన్ కు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నాడు. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినందుకు మాల్యాకు నాలుగు నెలల జైలు, రూ.2,000 చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాల్యా ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, అందుకు తగిన శిక్ష అవసరమని భావించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాల్యా తన కుటుంబ పిల్లలకు లోగడ 40 మిలియన్ డాలర్లు పంపించారు. వాటిని కోర్టుకు తిరిగి బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

మాల్యా వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశాన్ని ఇచ్చినట్టు గుర్తు చేసింది. రూ.9,000 కోట్ల రుణాలు చెల్లించడంలో మాల్యా విఫలం కావడంతో ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తన ఆస్తులను మాల్యా వెల్లడించలేదని, వాటిని తన పిల్లల పేరిట బదిలీ చేసుకుని నిబంధనలను తుంగలో తొక్కినట్టు విచారణలో గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles