Ritual by Telangana DH fuels witchcraft talk వివాదంలో తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్.. ఖమ్మంలో క్షుద్రపూజలు..

Ritual by telangana s director of public health fuels witchcraft talk

Director, Public Health, Dr G Srinivasa Rao, MPP, Self Styled Maatha, Bhukya Vijayalakshmi, Aswarapuram, charitable activities, medical camps, Badradri Kothagudem district, political ambitions, witchcraft, Thimnetanda, Sujatanagar mandal, Kothagudem district, Telangana

Telangana's high-profile Director of Public Health Dr Gadala Srinivasa Rao visit to a hamlet in Bhadradri-Kothagudem district, on Wednesday, set tongues wagging with many accusing him of performing rituals to further his political ambitions. Dr Srinivasa Rao visited Thimnetanda in Sujatanagar mandal of Bhadradri-Kothagudem district and performed rituals that looked more like invoking spirits. Videos of these which hit social media platforms, shocked everyone.

ITEMVIDEOS: వివాదంలో తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్.. ఖమ్మంలో క్షుద్రపూజలు..

Posted: 04/07/2022 12:28 PM IST
Ritual by telangana s director of public health fuels witchcraft talk

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అభయంగా నిలవాల్సిన వ్యక్తి.. దైవ ప్రార్థనలు చేసి దేవుడిని నమ్ముకుంటే ఎవరూ తప్పబట్టరు. కానీ తానే దేవతనంటూ స్వయంప్రకటిత దేవతగా అవతారమెత్తిన అధికారపార్టీకి చెందిన మండల అధ్యక్షురాలిని నమ్ముకోవడం.. అమె చుట్టూ ప్రదిక్షణలు చేయడం.. అమెతో కలసి క్షుద్రపూజలు చేయడం వివాదాస్పదంగా మారింది. నిత్యం రాష్ట్ర రాజధానిలో అటు వైద్యాధికారులకు, ఇటు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఈ యన ఏకంగా రాష్ట్ర సరిహద్దులోని ఖమ్మం జిల్లాకు వెళ్లి అక్కడ వింత పూజలు నిర్వహించడం తీవ్ర చర్చకు దారితీసింది.

అంతేకాదు మంటల్లో నిమ్మకాయలు వేస్తూ.. మిరపకాయలతో పూజలు చేయడం ఆయనను వివాదంలోకి లాగింది. స్వయప్రకటిత దైవాంశసంభూతురాలిగా ప్రకటించుకున్న మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే సైన్స్‌ బోధించాల్సిన డీహెచ్‌ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌ క్షుద్రపూజల తరహాలో చేశారని రాజ‌కీయ ఎంట్రీ కోస‌మే ఇదంతా చేస్తున్నారని  విమర్శిస్తున్నారు. సామాన్య ప్రజలకు మూఢ నమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన వ్యక్తే.. దేవతా అవతారంగా ప్రకటించుకున్న వ్యక్తి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చాంశనీయంగా మారింది.

కాగా కొంతకాలంగా డీహెచ్‌ ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎంపీపీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తనపై దేవతలు పూనుతారంటూ చెప్పుకుంటున్న పూనకం వచ్చిన మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆమె ఆశ్వీరాదం కోసం వంగి వంగి దండాలు పెట్టారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాతను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అంటూ పేర్కోన్నారు. ఆయన ఒక్కరే కాదు ఈ చిత్రవిచిత్ర పూజలకు తనతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా తీసుకెళ్లి పూజలు చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్‌ స్పందించారు. తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించేందుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కులదేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం​ లేదని తెలిపారు. అయితే అధికారపార్టీ ఎంపీపీ.. ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలియదని డీహెచ్ అన్నారు. గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles