Uttar Pradesh CM Yogi uses ‘abba jaan’ jibe again సీఎం యోగీ నోట మళ్లీ ‘‘అబ్బాజాన్’’ మాట.. అఖిలేశ్ ఫైర్

Uttar pradesh cm yogi adityanath abba jaan remark sparks political row

Abba jaan jibe, CM Yogi Adityanath, Samajwadi Party, Akilesh Yadav, Mulayam singh Yadav, abba jaan remark, bahan ji, bsp, mayawati, akhilesh yadav, up assembly elections, Uttarpradesh, Politics

In a double-edged statement, Uttar Pradesh Chief Minister Yogi Adityanath had said that prior to his government’s formation in 2017, the ration meant for the poor would get ‘digested’ by those who utter ‘abba jaan’.

సీఎం యోగీ నోట మళ్లీ ‘‘అబ్బాజాన్’’ మాట.. అఖిలేశ్ ఫైర్

Posted: 09/13/2021 07:51 PM IST
Uttar pradesh cm yogi adityanath abba jaan remark sparks political row

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌.. మ‌రోసారి అబ్బాజాన్ అనే ప‌దాన్ని వాడారు. స‌మాజ్ వాదీ పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించే ఉద్దేశంతో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. గత ఎన్నికలలో తమకు అన్నివర్గాల ప్రజలు మరీముఖ్యంగా త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా బిల్లును తీసుకువస్తామన్న నమ్మకంతో రాష్ట్ర ముస్లింలు తమకు ఓటు వేశారని గతంలో ఎన్నడూ లేని మెజారిటీని కట్టబెట్టారని చెప్పుకోచ్చిన విషయం తెలిసిందే. అయితే మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగున్న నేపథ్యంలో ఆయన అటు సమాజ్ వాదీతో పాటు ముస్లింలకు కూడా చురకలంటించేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో రేషన్ ఎవరికి దక్కదే ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పందంగా మారాయి.

ముస్లింలు త‌మ తండ్రుల‌ను ప్రేమ‌పూర్వ‌కంగా పిలిచేందుకు వినియోగించే అబ్బా జాన్ అనే పదాన్ని.. స‌మాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాద‌వ్ తో పాటు ఆయ‌న తండ్రి ములాయం సింగ్ యాద‌వ్ లకు ఆపాదిస్తూ.. వారిని పరోక్షంగా కామెంట్ చేశారు. కుషీన‌గ‌ర్ లో జ‌రిగిన రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2017 కంటే ముందు ఈ రేష‌న్ అబ్బా జాన్ అన్న‌వాళ్లు మాత్ర‌మే ఆర‌గించేవాళ్లు అని విమ‌ర్శించారు. అయితే అబ్బా జాన్ అంటూ సీఎం యోగి ఆ ప‌దాన్ని వాడ‌డాన్ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు యూజ‌ర్లు త‌ప్పుప‌ట్టారు. ఆ మాట‌లు వ‌ర్గ హింస‌కు దారి తీస్తాయ‌ని ఆరోపిస్తున్నారు.

ప్ర‌స్తుత బీజేపీ ఎవ‌ర్నీ వేరుగా చూడ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ రేష‌న్ అందేలా చూస్తోంద‌ని సీఎం తెలిపారు. గ‌తంలో అబ్బా జాన్ అని పిలిచేవాళ్ల‌కు మాత్ర‌మే రేష‌న్ ద‌క్కేద‌ని, కుషీ న‌గ‌ర్‌లో ఉండాల్సిన రేష‌న్‌.. నేపాల్‌, బంగ్లాదేశ్‌లో క‌నిపించేద‌ని, ఇప్పుడు ఎవ‌రైనా పేద‌వాడి రేష‌న్‌ను మింగాల‌ని చూస్తే, ఆ వ్య‌క్తి జైలులో ఊచలు లెక్క‌పెట్టాల్సిందే అని సీఎం యోగి అన్నారు. 2012 నుంచి 2017 వ‌ర‌కు యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌భుత్వం న‌డిచింది. 1990లో క‌రసేవ‌కుల‌పై ములాయం దాడి చేయించార‌ని యోగి విమ‌ర్శించారు.

బాబ్రీ మ‌సీదుపై ఒక్క పిట్ట కూడా వాల‌కుండా చూస్తాన‌ని అబ్బా జాన్ అన్న‌ట్లు సీఎం యోగి గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్ర‌భుత్వం ఆ స్థ‌లంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న‌ట్లు సీఎం యోగి తెలిపారు. అబ్బా జాన్ వ్యాఖ్య‌ల ప‌ట్ల స‌మాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాద‌వ్ రియాక్ట్ అయ్యారు. సీఎం యోగి త‌న భాష‌ను అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. ముఖ్యమంత్రి స్థాయిలో కొనసాగుతూ.. ప్రజలను రెచ్చగోట్టేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేద్దామని సవాల్ విసిరారు. అంతేకానీ త‌న తండ్రి గురించే సీఎం మాట్లాడాల్సి వస్తే.. తాను సీఎం తండ్రి గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అఖిలేశ్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles