5.5 Lakh Corona Cases Expected In Delhi By July 31 ఢిల్లీలో జూలై31 నాటికి 5.5 లక్షల కరోనా కేసులు

5 5 lakh coronavirus cases expected in delhi by july 31 aap government

Manish Sisodia, coronavirus, coronavirus Delhi, AAP Government, Delhi coronavirus cases, Deputy CM Manish Sisodia, Lieutenant Governor, Anil baijal, satyendra jain, Delhi covid-19 cases, Covid-19, Delhi, Politics

Delhi will have 5.5 lakh coronavirus cases by July 31 based on the current doubling rate of the infection, Deputy Chief Minister Manish Sisodia said today, predicting a huge demand for hospital beds a day after his government's decision to reserve beds for residents was cancelled by the Lieutenant Governor.

దేశరాజధానిలో జూలై31 నాటికి 5.5 లక్షల కరోనా కేసులు

Posted: 06/09/2020 09:57 PM IST
5 5 lakh coronavirus cases expected in delhi by july 31 aap government

దేశంలో కరోనా విజృంభన కోనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో లాక్ డౌన్ ఎత్తివేతకు కేంద్రం పలు సడలింపులను ఇచ్చిన నాటి నుంచి కరోనా వ్యాప్తి శరవేగాన్ని అందుకుంది. రోజుకు ఐదు వేల కేసులు వెలుగుచూసిన దేశంలో సడలింపులిచ్చిన నాటి నుంచి ఏకంగా దేశంలో రోజువారి వ్యాప్తి సంఖ్య రెట్టింపుకు చేరింది. ఒక దశలో దేశంలో ఏం జరుగుతుందో.. పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చసుకునే లోపు మారిపోతున్నాయి. ఇదే పరిస్థితిని ముందే ఊహించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రవాసుల కోసం ఆసుపత్రులలో బెడ్ లు రిజర్వు చేయాలని అసుపత్రులకు ఇచ్చిన అదేశాలను ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అంచనా వేశారు. ఓ రకంగా ఢిల్లీలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి స్థాయికి చేరుకుంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. అప్పటికి ఢిల్లీకి 80 వేల బెడ్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నెలాఖరుకి 15 వేల బెడ్లు అవసరమవుతాయని చెప్పారు. పేషెంట్లకు బెడ్లు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో ఆయన కరోనా ప్రభావం, పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో సిసోడియా మాట్లాడుతూ ఈ మేరకు ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలో 12 రోజుల వ్యవధిలో కరోనా వ్యాప్తి రెట్టింపు అవుతుందని, ఈ క్రమంలో ఈ నెల 15 నాటికి 44 వేల కేసులు, నెలాఖరు నాటికి లక్ష కేసులు.. జూలై 15 నాటికి 2.25 లక్షల కేసులు, జూలై నెలాఖరు నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు నమోదవుతాయని ఆయన అంచనావేశారు. కాగా, ఇప్పటి వరకైతే ఢిల్లీలో కరోనా వైరస్ సామూక వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలుపుతోందని సిసోడియా చెప్పారు. అయితే అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ఉందని తెలిపారు. వైరస్ ఎవరి నుంచి ఎలా సోకిందో కూడా తెలియని కేసులు సగానికి పైగా నమోదవుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి  వరకు  27,654 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,664 మంది కోలుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles