ఇటీవల తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాల్లో కూడా పాపులర్ అయిన డైలాగ్.. ఎంత ఆకలేసినా.. సింహం గడ్డి తినదు అన్నది. కానీ సింహం కూడా గడ్డి తినేసి సాధు జంతువులా మారిపోతోందంటే నమ్ముతారా.? చాల్లే.. చెప్పొచ్చారు సింహం ఎక్కడైనా గడ్డి కరుస్తోందా.? అంటారా. అది అసలే అడవికి రాజు. అంతగా తిండి దొరక్కపోతే ఆకలితో అలమటిస్తుంది కానీ గడ్డి తింటుందా? అని కొట్టిపారేయకండి. ఇంకా అవకాశముంటే పైన చెప్పిన డైలాగే తిప్పి అప్పగిస్తామంటారా.? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
మృగరాజు గడ్డిని తింటుంది. ఇది వాస్తవం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ లోని ఖంబా అడవుల్లో ఈ వీడియో అక్కడి స్థానికులకు చిక్కింది. గుజారాత్ లోని అమ్రేలీ జిల్లా ఖంభా అటవీ ప్రాంతంలో ఓ సింహం ఇలా పచ్చ గడ్డి మేస్తూ కనిపించింది. అయితే సింహం తింటుందన్నది స్పష్టంగా కనిపిస్తున్నా..? దేనిని తింటుందన్నది తెలియక తికమకపడ్డ స్థానికులు తమ సెల్ ఫోన్ తీసి.. కెమెరాలతో జూమ్ చేసి చూశారు. మృగరాజు ఏకంగా గడ్డి మేస్తుండటంతో చూసిన వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
సింహాలు గడ్డి తినడం చాలా అరుదైన ఘటన అని షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ తెలిపారు. అయితే, వాటి కడపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. అంతేగా మరి సింహం సాధు జంతువుగా ఎలా మారుతుంది. మాంసాహారి శాఖాహారిగా ఎలా మారుతారని కూడా నెట్ జనులు పేర్కోంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more