YS JaganMohan Reddy takes oath as CM of Andhra Pradesh ‘‘జగన్మోహన్ రెడ్డి అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..’’

Ys jaganmohan reddy takes oath as cm of andhra pradesh

YS JaganMohan Reddy sworn in as CM of AP, YS JaganMohan Reddy Andhra Pradesh CM, YS Jagan, Governor ESL Narasimhan, Andhra Pradesh Chief Minister, YS JaganMohan Reddy, Chief Minister, YSRCP, Assembly elections, lok-sabha-elections-2019, andhra pradesh, politics

YS JaganMohan Reddy takes oath as Chief Minister of Andhra Pradesh, which was presided by Governer ESL Narasimhan at exactly 12.24 pm today at vijayawada Indira Pridarshini Muncipal Stadium.

‘‘జగన్మోహన్ రెడ్డి అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..’’

Posted: 05/30/2019 12:27 PM IST
Ys jaganmohan reddy takes oath as cm of andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశేషంగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు మధ్య ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. వైఎస్ జగన్ చేత సరిగ్గా 12గంటలా 24 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్ జగన్ అనే నేను అనే సమయంలో స్టేడియంలోని దిక్కులు పెక్కుటిల్లేలా.. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తారు. పార్టీ కార్యకర్తలు నినాదాల మధ్యే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని పూర్తి చేశారు.

అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి బయలుదేరి విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిఫల్ స్టేడియానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణస్వీకారానికి బయలుదేరే ముందు ఆయనను టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ ఈవో సింఘాల్‌, అర్చకులు వైఎస్‌ జగన్‌కు స్వామి వారి శేషవస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైఎస్‌ జగన్‌ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి ఫోన్‌ చేసిన జగన్‌ ఆయన ఆశీస్సులు కోరారు. స్వామి ఆశిస్సులు అందుకున్నారు.  విజయవాడలో జగన్ ప్రమాణస్వీకార సమాయానికి వాతావరణంలో కూడా మార్పులు సంభవించడం.. పార్టీ నేతలు రాష్ట్ర భవిష్యత్ ఇక బంగారుమయమని అవుతుందని సంబరపడుతున్నారు. భానుడి భగభగలతో అల్లాడిపోయే విజయవాడలో వరుణుడు కరుణించి వర్షం కురిపించడంతో ఏర్పాట్లకు విఘాతం కలిగినా.. వేడిమి, ఉక్కపోత నుంచి కాసింత ఉపశమనం లభించిందని కార్యకర్తలు పేర్కోంటున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles