Set back to AP Govt in YS Jagan attack case జగన్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Set back to ap govt in ys jagan attack case

YS Jagan, NIA, High court, Andhra pradesh, AP government, Srinivasa Rao, vishaka airport, crime

High court of Andhra Pradesh denied to give stay on NIA enquiry on attempt to murder case on YS Jagan Mohana Reddy

జగన్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Posted: 01/21/2019 02:11 PM IST
Set back to ap govt in ys jagan attack case

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సేకరించిన వివరాలను, సాక్ష్యాలను ఎన్ఐఏకు అప్పగించేందుకు నిరాకరించడం.. దానిపై రాష్ట్రోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలిన క్రమంలో ఈ కేసును తమ పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు చేసిన మరో ప్రయత్నంపై కూడా న్యాయస్థానం నీళ్లు చల్లింది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. జగన్ పై దాడి కేసులో ఏపీ సిట్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారని, కేసు విచారణ దాదాపుగా పూర్తి చేశారనీ, ఇలాంటి సమయంలో ఎన్ఐఏకు కేసును అప్పగించడం సరికాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జనవరి 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్ఐఏ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే దర్యాప్తు ఫైళ్లను కోర్టు ముందు ఉంచాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్ పోర్టు లాబీలో కూర్చున్న జగన్ తో మాట్లాడి, సెల్పీ దిగుతానంటూ కొడికత్తితో ఆయన చేతిపై శ్రీనివాసరావు అనే నిందితుడు గాయపర్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  NIA  High court  Andhra pradesh  AP government  Srinivasa Rao  vishaka airport  crime  

Other Articles